యువోత్సాహం
యువోత్సాహం
Published Sat, Jan 21 2017 11:08 PM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM
పోటాపోటీగా యువమహోత్సవ్ క్రీడలు
కర్నూలు(హాస్పిటల్): యువమహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం సిల్వర్‌జూబ్లీ కళాశాలలో ఆటల పోటీలు హోరాహోరీగా జరిగాయి. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యువమహోత్సవ్ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఖో–ఖో, కబడ్డీ, షటిల్ బ్యాట్మింటన్, చెస్, క్యారమ్స్, టగ్ ఆఫ్ వార్, వాలీబాల్ పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలను సెట్కూరు సీఈవో మస్తాన్‌వలీ ప్రారంభించారు. విజేతలకు ఆదివారం సాయంత్రం జరిగే ముగింపు కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. కార్యక్రమంలో సెట్కూరు మేనేజర్ పీవీ రమణ, సిల్వర్‌జూబ్లీ, కేవీఆర్, వాసవి, పీసీరెడ్డి, సెయింట్ జోసఫ్, హజీరా డిగ్రీ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
విజేతలు వీరే...
–క్యారమ్స్(గర్ల్స్)–1.వాసవి మహిళా కళాశాల, 2. వాసవి మహిళా కళాశాల, 3. సిల్వర్‌జూబ్లీ కళాశాల
–క్యారమ్స్(బాయ్స్)–1. చైతన్య శ్రీనివాస్,సిల్వర్‌జూబ్లీ ప్రభుత్వ కళాశాల, 2. సాయి కృష్ణ శంకరాస్ డిగ్రీ కళాశాల, 3. బాబూరావు, సిల్వర్‌జూబ్లీ కళాశాల
–కబడ్డి(ఉమెన్స్)–1. సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కళాశాల, 2. కేవీఆర్ కళాశాల, 3. వాసవి కళాశాల
–ఖోఖో(ఉమెన్)–1. కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల, 2. సిల్వర్‌జూబ్లీ కళాశాల, 3. ఆర్‌సీ రెడ్డి కాలేజి
–వాలీబాల్ (ఉమెన్)–1. కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల, 2. సిల్వర్‌జూబ్లీ కళాశాల
–చెస్ (గర్ల్స్)–1. తస్నీమ్, కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల, 2. అనూషా, సిల్వర్‌జూబ్లీ కళాశాల, 3. మనీషా, సిల్వర్‌జూబ్లీ కళాశాల
–చెస్(బాయ్స్)–1. రామ్‌ప్రదీప్, రాయలసీమ యూనివర్శిటి, 2. భాస్కర్, కర్నూలు, 3. వెంకటనాయుడు, కర్నూలు
–టేబుల్ టెన్నిస్(బాయ్స్)–1. సీహెచ్ బాబురావు, సిల్వర్‌జూబ్లీ కళాశాల, 2. శ్రీకాంత్‌రెడ్డి, సిల్వర్‌జూబ్లీ కళాశాల
–షటిల్ బాట్మింటన్(బాయ్స్)–1. విజయదుర్గ డిగ్రీ కళాశాల, 2. నారాయణ జూనియర్ కళాశాల, 3. విజయదుర్గ డిగ్రీ కళాశాల
–టగ్ ఆఫ్ వార్–1. సిల్వర్‌జూబ్లీ కళాశాల, 2. కేవీఆర్ డిగ్రీ కళాశాల, 3. వాసవి డిగ్రీ కళాశాల
Advertisement
Advertisement