కొన్నిపార్కుల్లోనూ, మాల్స్‌లోనూ పిల్లలకోసం కేటాయించిన వలయాకారపు ట్రామ్ పోలిన్‌లు చూసే ఉంటారు. ‘మనమూ అలా గెంతితే ఎంత బాగుంటుంది’ అనుకుంటారు పెద్దవాళ్లు. కానీ, శరీరం సహకరించదేమోనని సందేహిస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ల కోసం గెంతుతూ సరదాగా వ్యాయామం చేసే ట్రాంపోలిన్ వాక్
అందుబాటులోకి వచ్చింది.
పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ నగరాల్లోని ఫిట్‌నెస్ కేంద్రాలు వినోదానికి– వ్యాయామాలకు మధ్య ఉన్న విభజన రేఖను తొలగిస్తూ ఈ ట్రామ్ పోలిన్ పరికరాలను పరిచయం చేస్తున్నాయి. జిమ్‌లో రొటీన్‌గా వ్యాయామాలు చేయడం బోర్ అనిపిస్తే, ఈ వ్యాయామాలను ప్రయత్నించవచ్చు.
అనేక ప్రయోజనాలు...
⇒ ట్రామ్ పోలిన్‌పై గెంతడం వల్ల గంటకు 9 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తేంత ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ట్రామ్ పోలిన్ వర్కౌట్‌లు హృదయనాళాల పనితీరును బాగుచేయడంతోపాటు ఒత్తిడిని త్వరగా నివారిస్తాయి.
⇒ ‘ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది’అని ఢిల్లీకి చెందిన జుంబా శిక్షకుడు, ట్రామ్ పోలిన్ ఫిట్‌నెస్ కోచ్ ఆరుషి పస్రిజా తెలియజేస్తున్నారు.
⇒ ట్రామ్ పోలిన్ మృదువైన ఉపరితలం రన్నింగ్ లేదా ఇతర భారీ వ్యాయామాలతోపోలిస్తే కీళ్లపై భారాన్ని తగ్గిస్తుందని వైద్యులు గమనించారు, ఇది తేలికపాటి కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ట్రామ్ పోలిన్ వ్యాయామాలు ఎముక ఆరోగ్యానికి, కండరాల బలోపేతానికి, సమతుల్యతకు సహకరిస్తాయి.
⇒ కదలికలు బాగా ఉండటం వల్ల త్వరగా కేలరీలు ఖర్చవుతాయి, బరువు తగ్గుతారు. హృదయ స్పందన రేటు పెరగడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
⇒ ‘జంపింగ్ ఎముక సాంద్రతను ప్రేరేపిస్తుంది, ఇది బోలు ఎముకల వ్యాధిని నిరోధించడంలో సహాయపడుతుంది‘ అని ఆర్థోపెడిక్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ యుగల్ తెలియజేశారు.
మొదట్లోనే జంపింగ్‌లు వద్దు...
ట్రామ్ పోలిన్ వర్కౌట్‌లలో స్క్వాట్ జంప్‌లు, జంపింగ్ జాక్స్, టక్ జంప్‌లు వంటి కఠినమైన కదలికలు కూడా ఉంటాయి. కానీ అదంతాప్రారంభ దశలో కాదు. పూర్తి శరీర వ్యాయామాలుగా మార్చడానికి వర్కౌట్స్, యోగా వంటి అనుకూలమైన వ్యాయామాలతో కలపాలి. ఈ వ్యాయామాలు చేయడానికి రెసిస్టెన్ ్స బ్యాండ్‌లను కూడా ఉపయోగించవచ్చు.
ప్రమాదం.. నివారణ
ఫిట్‌నెస్‌లో ట్రామ్ పోలిన్‌ను చేర్చాలనే ఆలోచన ఉత్తేజకరమైనదిగా అనిపించవచ్చు. అయితే గాయాలను నివారించడానికి జాగ్రత్త అవసరం. నేలపైన సరిగా సెట్ కాకపోతే ట్రామ్ పోలిన్ పడిపోవడం,పాదాలు బెణకడం, గాయాలకు దారితీయడం వంటివి. అందుకని నిపుణుల సూచనలు తీసుకొని, వీటి కొనుగోలులోనూ, ఉపయోగించడంలోనూ మెలకువలు తెలుసుకోవాలి.
⇒ ట్రామ్ పోలిన్‌పై ఉన్నప్పుడు ముందుగా మోకాళ్లను వంచి, శరీర బ్యాలెన్స్ చూసుకోవాలి.
⇒పరధ్యానంగా ఉండకూడదు. ట్రామ్ పోలిన్ పైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టీని గట్టిగా పట్టుకోవాలి.
⇒ ట్రామ్ పోలిన్ వ్యాయామాలు చేస్తున్నప్పుడు మంచి గ్రిప్ సాక్స్ లేదా షూ ధరించాలి.
⇒ నెమ్మదిగాప్రారంభించి, క్రమంగా తీవ్రతను పెంచాలి.
⇒ వారానికి 2–3 సార్లు చేసి, శరీర అనుకూలతను బట్టి వ్యవధిని పెంచుకోవచ్చు.
సమస్యలు ఉంటే..
ఆస్టియోపొరోసిస్, కీళ్లనొప్పులు, వెన్ను లేదా మోకాలి సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ వ్యాయామాలను చేయకూడదు. గర్భిణులు, గుండె జబ్బులు ఉన్నవారు కూడా ముందుగా తమ వైద్యుడిని సంప్రదించాలి. తరచుగా కింద పడిపోయే వ్యక్తులు కూడా ఆలోచించాలి. వృద్ధులయితే తప్పకుండా ఇతరుల సాయం తీసుకోవాలి.
డెస్క్ ఉద్యోగులకు మరింత ప్రయోజనం
డెస్క్ జాబ్‌లు చేసేవారికి ట్రాఅందరికీ ధన్యవాదాలు
డెస్క్ జాబ్‌లు చేసేవారికి ట్రామ్ పోలిన్ ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజ్ అద్భుతమైనది. ఈ వ్యాయామం వల్ల కడుపు, దిగువ శరీర కదలికలు మెరుగ్గా ఉంటాయి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే సమస్యలను అధిగమించడంలో ఈ వ్యాయామం సహాయపడుతుంది. అనేక కార్పొరేట్ కార్యాలయాలు తమ ఉద్యోగుల కోసం ట్రామ్ పోలిన్ వర్కౌట్ సెష¯న్లను నిర్వహించడం ప్రారంభించాయి. అయితే, పిల్లల పార్కుల్లో చూసే వాటికి పెద్దవారి ఫిట్‌నెస్ ట్రామ్ పోలిన్ భిన్నంగా ఉంటుంది. ఇంట్లోనే పెద్దవాళ్లు ఉపయోగించే ట్రామ్ పోన్లు సాధారణంగా చిన్నవిగా, దృఢంగా ఉంటాయి. ఇవి క్రీడా పరికరాలు దొరికే చోట, ఆన్‌లైన్ మార్కెట్లోనూ లభిస్తున్నాయి. అయితే, బరువును మోయగలిగే దృఢమైన ట్రామ్ పోన్‌లను ఎంచుకోవాలి. అదేవిధంగా ఫిట్‌నెస్ నిపుణుల సూచనలు ΄ాటించాలి. ఇందుకు ఆ¯న్లైన్ ట్రైనర్స్ సాయం కూడా తీసుకోవచ్చు. – ఆరుషి, ఫిట్‌నెస్ ట్రైనర్
Comments
Please login to add a commentAdd a comment