జిమ్నాస్టిక్ పోటీలో పాల్గొన్న విద్యార్థిని
దివ్యాంగులకు ఆటల పోటీలు
Published Thu, Sep 22 2016 9:27 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
గుంటూరు స్పోర్ట్స్ : రోటోఫెస్ట్ అధ్వర్యంలో గురువారం స్వర్ణభారతి నగర్‌లోని దాక్షిణ్య సంస్థలోని శారీరక, మానసిక దివ్యాంగ విద్యార్థులకు పరుగుపందెం, మ్యూజికల్ చైర్, డ్రాయింగ్, షాట్‌పుట్, లెమన్ ఇన్ స్పూన్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. పోటీలను దాక్షిణ్య సంస్థల డైరెక్టర్ టి.వి.రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి స్డేడియంలో జిమ్నాస్టిక్ పోటీలను రోటరీ డైరెక్టర్ నంబూరు సుబ్బారావు ప్రారంభించారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అధ్యక్షుడు పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లలను ప్రోత్సహించేందుకు పలు అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టి.వి.రావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవలు వెలకట్టలేనివని చెప్పారు. విజేతలకు ఈ నెల 25న బహుమతి ప్రదానం చేస్తామని రొటేరియన్ అంకమ్మరావు తెలిపారు.
Advertisement
Advertisement