Handicaped children
-
ఆమె వివరాలు చెప్పండి.. నా వంతు సాయం చేస్తా: కేటీఆర్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఎవరైనా బాధితులు.. సాయం కోసం సోషల్ మీడియాలో కేటీఆర్‌ను సాయం అడిగితే వెంటనే స్పందించి.. వారికి తన వంతు సాయం అందిస్తుంటారు. తాజాగా ఓ వీడియో చూసి చలించిపోయిన కేటీఆర్.. బాలిక వివరాలను చెప్పాలని ఆమెకు సాయం అందిస్తానని ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. వివరాల ప్రకారం.. బీహార్‌లోని సివాన్ జిల్లాకు చెందిన ప్రియాన్షు కుమారి ఒకే కాలుతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లి చదువుకుటోంది. తన బాల్యం నుంచి ఇలాగే వెళ్లాల్సి వస్తోందని ప్రియాన్షు ఆవేదన వ్యక్తంచేసింది. ప్రభుత్వం తనకు కృతిమ కాలు అందించాలని వేడుకుంది. తనకు డాక్టర్ కావాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన కేటీఆర్.. చలించిపోయి సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందింస్తూ.. ఆ చిన్నారి వివరాలను పంపాలని కోరారు. తన వంతుగా ఆమెకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. If someone at @ANI can me the girl’s contact details, will be my pleasure to help (in my personal capacity) the young one achieve her dreams https://t.co/5gBoFAsIv0 — KTR (@KTRTRS) July 1, 2022 ఇది కూడా చదవండి: TSRTC: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్ -
Inspirational Story: నా కొడుకుకు కళ్లులేకపోతేనేం.. నా కళ్లతో లోకాన్ని పరిచయం చేస్తా!
దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అనే నానుడికి మరో ఉదాహరణ ఆమె కథ. వికలాంగుడైన బిడ్డను ఇతర తల్లుల్లా చెత్త కుప్పల్లో పడేయడానికి ఆమె మాతృ హృదయం వెనుకాడింది. అమ్మకు బిడ్డ ఎప్పటికీ బరువు కాదుగా! అందుకే కడుపున మోసిన బిడ్డను ఈ సారి వీపున మోసింది. ప్రపంచం అంచులా దాకా తీసుకెళ్లింది. కళ్లు కనిపించని బిడ్డకు తన కళ్లతో లోకమంతా చూపిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ తల్లీబిడ్డలకు చెందిన ఫొటోలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. వీటిని చూస్తే మీరు ఖచ్చితంగా భావోధ్వేగానికి గురౌతారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ సన్‌షైన్ కోస్ట్‌కు చెందిన నిక్కి ఆంత్రమ్ (43)కు 17 ఏళ్ల వయసులో మగ బిడ్డ పుట్టాడు. ఐతే పుట్టిన బిడ్డకు అంగవైకల్యంతోపాటు, కళ్లు కూడా కనిపించవని తెలుసుకుని కుమిలిపోయింది. ఐతేనేమి తన కళ్లతో బిడ్డకు లోకాన్ని చూపాలనుకుంది. 24 గంటలు కొడకు జిమ్మీ వెన్నంటే ఉండి ఏ కష్టం తెలియకుండా పెంచసాగింది. ఇప్పుడు జిమ్మీకి 26 ఏళ్లు. ఐతే ప్రపంచ పర్యటన (వరల్డ్ టూర్)కు వెళ్లాలనుకున్న నిక్కి తన కొడుకును కూడా తనతోపాటే తీసుకెళ్లాలనుకుంది. వీపుపై జిమ్మీని మోస్తూ హవాయి నుంచి బాలి వరకు అనేక ప్రదేశాలకు కొడుకును తీసుకెళ్తోంది. మామూలు పిల్లలకు అందినట్టే నా కొడుకుకు కూడా సకల ఆనందాలను పంచాలనుకుంటున్నాను. నా కోడుకు జిమ్మీతో కరోనా వ్యాప్తికి ముందే కెనడాను సందర్శించానలనుకున్నాను. డైపర్లు, బట్టలు, బెడ్ ప్యాడ్స్, దుప్పట్లు, దిండులు మాతో పాటు తీసుకెళ్తున్నాను. వీపుపై జిమ్మీని మోయడం ప్రాక్టీస్ చేశాను కూడా. ఇక మరిన్ని ప్రదేశాలను మేమిద్దరం సందర్శిస్తామని నిక్కీ చెబుతోంది. నిక్కీ - జిమ్మీల కథ ఎందరికో ఆదర్శం. చదవండి: నోట్లో గుడ్డలు కుక్కి.. పీక నులిమి హత్య! ఏం ఎరగనట్టు నాటకం.. -
వాడని ఫోన్లతో.. వైకల్య బాధితులకు ఆసరా..
సాక్షి, సిటీబ్యూరో: దివ్యాంగులను ఆదుకునేందుకు ఇప్పుడు సరికొత్త మార్గాన్ని నారాయణ్ సేవా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. నగరంతో పాటు దేశవ్యాప్తంగా అంగవికలుర కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఇన్‌స్టా క్యాష్ అనే సి2బి ఆన్లైన్ ఇ కామర్స్ ప్లాట్ ఫామ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్ట్‌ఫోన్స్ సెకండ్స్ సేల్స్ కోసం...ఇన్‌స్టా క్యాష్... ఆన్లైన్ ద్వారా మనం వాడని ఫోన్స్‌ని ఇన్‌స్టా క్యాష్ ద్వారా విక్రయించుకునే వెసులుబాటు ఉంది. దీని ద్వారా కేవలం 60 సెకన్లలోనే మన సెకండ్ హ్యాండ్ ఫోన్‌ని అమ్మి నగదును పొందవచ్చునని ఈ ప్లాట్‌ఫామ్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో దివ్యాంగులకు సేవలు అందిస్తున్న నారాయణ్ సేవాశ్రమ్ వైకల్య బాధితుల ఆపరేషన్లకు, ఇతర చికిత్సలకు గాను మనవంతు సాయంగా మనం వాడని ఫోన్స్‌ను అందిస్తే చాలని అభ్యర్ధిస్తోంది. ఈ మేరకు ఈ సంస్థ ఇన్‌స్టా క్యాష్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు మనం నారాయణ్ సేవాశ్రమ్కు విరాళం అందించేందుకు రూ.వేలూ లక్షలూ ఇవ్వక్కర్లేదు. కేవలం మన వాడని ఫోన్‌ని ఇన్‌స్టా క్యాష్‌లో అప్లోడ్ చేసి దాని ద్వారా వచ్చే మొత్తాన్ని నారాయణ్ సేవాశ్రమ్కి అందించమంటే చాలు. దివ్యాంగుల సేవ కోసం నిరుపయోగంగా ఉన్న ఫోన్‌ని మార్గంగా మార్చుకోనే ఆలోచన దివ్యంగా ఉంది కదూ... -
పది వస్తే పాసే...
విజయనగరం, రామభద్రపురం, (బొబ్బిలి) :విద్యాహక్కు చట్టం ప్రకారం అందరూ చదవాలి.. అయితే సాధారణ విద్యార్థులతో పాటు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను ఒకేలా చూడకుండా ప్రత్యేక సడలింపులు ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లల హాజరు శాతం పెంచేందుకు... పరీక్షల గండం నుంచి గట్టెక్కడానికి చేయూత అందించనుంది. ఉత్తీర్ణత మార్కులను తగ్గించడంతో పాటు ప్రతి గంటకూ 20 నిమిషాల అదనపు సమయం కేటాయిస్తూ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ప్రతి విద్యార్థీ ఉత్తీర్ణతను సాధించాలన్న విద్యాచట్టం, సమగ్ర శిక్షాభియాన్ ఆశయాలు నెరవేరుతాయని ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. శారీరక, మానసిక వైకల్యాల కారణంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అధికశాతం చదువు మధ్యలో మానేస్తున్నారు. తరగతులు పెరిగే కొద్ది బడి మానేసే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ముఖ్యంగా తొమ్మిది, పది తరగతుల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుందోన్న విషయం పలు సర్వేల్లో వెల్లడైంది. ఆసక్తి ఉన్నప్పటికీ ఉత్తీర్ణతకు అవసరమైన మార్కులను సాధించలేక మరికొందరు పదో తరగతి తర్వాత చదువులను కొనసాగించలేకపోతున్నారు. జిల్లాలోని 4,789 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు పాఠశాలల్లో చేరగా వారిలో 712 మంది పదో తరగతి చదువుతున్నారు. గతంలో ఆరు నుంచి ఇంటర్ వరకు చదువుతున్న అన్ని రకాల వైకల్యాలు ఉన్న విద్యార్థులకు ఉత్తీర్ణతను 35 మార్కుల నుంచి 20 కి తగ్గించారు. అలాగే ఫీజు మినహాయిస్తూ 2001, 04, 11లలో పలు జీఓలతో మార్గదర్శకాలు ఇచ్చింది. అయితే ఎస్ఎస్ఏ విలీనవిద్య యంత్రాంగం, విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తుల మేరకు ఇప్పుడు మానసిక వైకల్యం గల పిల్లలు, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, పక్షవాతం ఉన్నవారికి ఉత్తీర్ణతను పది మార్కులకు తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసినట్లు అధికార సమాచారం. ఉత్తీర్ణతకు ఇవీ మార్గదర్శకాలు... ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న ప్రత్యేకావసరాల గల విద్యార్థులకు అధిక శాతం విభాగాల కు మూల్యాంకనం చేసేటప్పుడు వ్యాకరణ దోషా లు, వాక్య నిర్మాణ లోపాలపై పట్టింపు ఉండదు. కాలిక్యులేటర్లు, జామెట్రీ బాక్సులు, తదితర పరీక్షలకు అవసరమైన మార్కుల శాతాన్ని అంధత్వం ఉన్న విద్యార్థులకు ఉత్తీర్ణత మార్కులను 35 నుంచి 20కు తగ్గించారు. దీంతోపాటు వినికిడి లోపం ఉన్న వారు తెలుగు, హిందీ, ఆంగ్లంలో ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివితే సరిపోతుంది. ప్రత్యేక అభ్యసన లోపం గల విద్యార్థులకైతే తృతీయభాష ఆంగ్లం సబ్జెక్ట్‌ను మినహాయించారు. వీరి ఉత్తీర్ణత కోసం చిన్న లోపాలను పట్టించుకోనవసరం లేదు. బుద్ధిమాంద్యం ( మెంటల్ రిటార్డెడ్), ఎదుగుదల లోపం (ఆటిజం), మస్కిష్క పక్షపాతం (సెరిబ్రల్పాల్స్తో)తో బాధపడుతున్న విద్యార్థులకు పది మార్కులు.. మిగిలిని దృష్టిలోపం.. వినికిడి లోపం ఉన్నవారు మాత్రం 20 మార్కులు సాధించాలి. వీరికి జవాబులను రాయడానికి ప్రత్యేకమైన మందం గలిగిన జవాబుపత్రాలు ఇస్తారు. పఠనైపుణ్యం, గ్రాఫులు గీయడంతో పాటు వ్యాకరణ, వాక్యనిర్మాణ లోపాలపై మినహాయింపు ఇచ్చారు. ఎముకల బలహీనత (ఆర్థోపెడికల్ ఇంపెయిడ్) బాధితులకు పరీక్షలను రాసేందుకు సహాయకుడిని కేటాయించడంతో పాటు ప్రత్యేక బల్ల, కుర్చీ ఇస్తారు. అలాగే దృష్టి లోపంతో బాధపడుతున్నవారికి పరీక్షలకు అవసరమైన సామగ్రిని వెంట తీసుకెళ్లేందుకు మినహాయింపు ఇచ్చారు. పదో తరగతి చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలందరికీ పరీక్ష ఫీజు ఉచితం చేశారు. -
ఎంతపని చేశావమ్మా!
ఆమె ఓ విధి వంచిత.. ప్రేమ వివాహం చేసుకుంది.. దీంతో కన్నవారు దగ్గరకు రానీయలేదు.. పుట్టిన పిల్లలిద్దరూ దివ్యాంగులే.. మనస్పర్థలతో భర్త దూరమయ్యాడు.. ఈ సమస్యలకు తోడు వేధిస్తున్న అనారోగ్యం.. మానసికంగా కుంగిపోయింది.. చివరకు కొడుకులిద్దరినీ అనాథలను చేసి బలవన్మరణానికి పాల్పడింది. తినడం కూడా చేతకాని స్థితిలో వైకల్యంతో బాధ పడుతున్న చిన్నారుల బేల చూపులు చూపరులను కంట తడి పెట్టిస్తున్నాయి. కానీ వారిని అక్కున చేర్చుకునేదెవరు? ఈ విషాద ఘటన చీడికాడ మండలం అప్పలరాజుపురంలో జరిగింది. చీడికాడ (మాడుగుల): అప్పలరాజుపురం విషాదంతో కుమిలిపోయింది. పిల్లల్ని అనాథలను చేసి ఓ తల్లి ఆత్మహత్య అందరినీ కలచివేసింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇన్చార్జి ఎస్సై హిమగిరి అందించిన వివరాలు.. గ్రామానికి చెందిన రెడ్డి సునీత (30) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. శనివారం సాయంత్రం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి పెదపాటి లక్ష్మి ఆదివారం చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సర్పంచ్ చుక్కా అప్పలనాయుడు, పెద్దల సమక్షంలో శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ప్రేమకు దూరమైన అభాగ్యురాలు ప్రేమ రాహిత్యమే సునీత మరణానికి కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. సునీత పుట్టింటి వారిది రోలుగుంట మండలం జె.నాయుడు పాలెం గ్రామం. పదేళ్ల క్రితం సునీత, అప్పలరాజుపురానికి చెందిన రెడ్డి గంగరాజులు ప్రేమించుకున్నారు. వేరువేరు కులాలకు చెందిన వారు కావడంతో సునీత కుటుంబసభ్యులు ఈ వివాహానికి అంగీకరించలేదు. వారిని ఎదురించి సునీత గంగరాజును పెళ్లాడింది. వీరికి భానుతేజ(8), త్రిగుణు(6) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం గంగరాజు మండలంలోని దిబ్బపాలెం యూపీ స్కూల్లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలు పుట్టాక కూడా సునీత తల్లిదండ్రులు సునీతతో సక్యతగా మెలగలేదు. దీంతో ఒంటరితనం ఆవహించింది. ఇదిలా ఉంటే పెద్ద కుమారుడు భానుతేజ ఆరోగ్యం అంతంత మాత్రం. మానసిక వికలాంగుడు. రెండో కుమారుడు పుట్టుకతోనే ఒక చెవి పూర్తిగా లేకపోవడంతో వినికిడి సమస్యతో బాధపడుతున్నాడు. ఈ సమస్యలన్నింటి మధ్య భర్త గంగరాజుతో మనస్పర్ధలు ఏర్పడడంతో మానసికంగా కుంగిపోయింది. దీంతోపాటు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆత్మహత్యకు పాల్పడింది.ç సునీత ఆత్మహత్యతో ఇద్దరు పిల్లలు తల్లిలేని అనాథలుగా మిగిలిపోయారు. వారికి దిక్కెవరు?ఇదిలా ఉంటే చిన్న కుమారుడికి చేతితో తినడం చేతకాకపోవడంతో రోజూ సునీతే తినిపించేదని చుట్టుపక్కల వారు చెబుతూ రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. పిల్లలిద్దిరినీ ఎవరికి అప్పగించాలో చెప్పాలని మృతురాలి తల్లి లక్ష్మీ, సోదరి, కుటుంబసభ్యుల రోదనలతో విషాద ఛాయలు అలముకున్నాయి.∙ -
దివ్యాంగులకు ఆటల పోటీలు
గుంటూరు స్పోర్ట్స్ : రోటోఫెస్ట్ అధ్వర్యంలో గురువారం స్వర్ణభారతి నగర్‌లోని దాక్షిణ్య సంస్థలోని శారీరక, మానసిక దివ్యాంగ విద్యార్థులకు పరుగుపందెం, మ్యూజికల్ చైర్, డ్రాయింగ్, షాట్‌పుట్, లెమన్ ఇన్ స్పూన్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. పోటీలను దాక్షిణ్య సంస్థల డైరెక్టర్ టి.వి.రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి స్డేడియంలో జిమ్నాస్టిక్ పోటీలను రోటరీ డైరెక్టర్ నంబూరు సుబ్బారావు ప్రారంభించారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అధ్యక్షుడు పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లలను ప్రోత్సహించేందుకు పలు అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టి.వి.రావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవలు వెలకట్టలేనివని చెప్పారు. విజేతలకు ఈ నెల 25న బహుమతి ప్రదానం చేస్తామని రొటేరియన్ అంకమ్మరావు తెలిపారు.