
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఎవరైనా బాధితులు.. సాయం కోసం సోషల్ మీడియాలో కేటీఆర్‌ను సాయం అడిగితే వెంటనే స్పందించి.. వారికి తన వంతు సాయం అందిస్తుంటారు. తాజాగా ఓ వీడియో చూసి చలించిపోయిన కేటీఆర్.. బాలిక వివరాలను చెప్పాలని ఆమెకు సాయం అందిస్తానని ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు.
వివరాల ప్రకారం.. బీహార్‌లోని సివాన్ జిల్లాకు చెందిన ప్రియాన్షు కుమారి ఒకే కాలుతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లి చదువుకుటోంది. తన బాల్యం నుంచి ఇలాగే వెళ్లాల్సి వస్తోందని ప్రియాన్షు ఆవేదన వ్యక్తంచేసింది. ప్రభుత్వం తనకు కృతిమ కాలు అందించాలని వేడుకుంది. తనకు డాక్టర్ కావాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్‌ఐ వార్తా సంస్థ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
ఈ వీడియోను చూసిన కేటీఆర్.. చలించిపోయి సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందింస్తూ.. ఆ చిన్నారి వివరాలను పంపాలని కోరారు. తన వంతుగా ఆమెకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
If someone at @ANI can me the girl’s contact details, will be my pleasure to help (in my personal capacity) the young one achieve her dreams https://t.co/5gBoFAsIv0
— KTR (@KTRTRS) July 1, 2022
ఇది కూడా చదవండి: TSRTC: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment