మాట్లాడుతున్న దేవేందర్‌రెడ్డి
- విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దు
- ఉపాధ్యాయులకు టీఆర్‌ఎస్ నేత దేవేందర్‌రెడ్డి సూచన
రామాయంపేట: విద్యార్థులకు అర్థమయ్యేలా స్వేచ్ఛాయుత వాతావరణంలో పాఠాలు బోధించాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి, కోనాపూర్ సింగిల్ విండో చైర్మన్ దేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నస్కల్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పాఠశాలను విద్యాపరంగా మెరుగుపర్చడానికి తాను స్వయంగా ముగ్గురు వలంటీర్లను ఏర్పాటు చేసి వేతనాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు.
విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా ఆటపాటల మధ్య చదువు చెప్పాలని సూచించారు. ఎంఈఓ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో వికలాంగ విద్యార్థులకు చదువు చెప్పించడానికి ప్రత్యేకంగా ఉపాధ్యాయుడిని నియమించినట్టు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు సుననీల్ మాట్లాడుతూ.. తమకు విద్యార్థుల తల్లిదండ్రులనుంచి పూర్తిస్థాయిలో సహకారం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయురాలు శారద మాట్లాడుతూ.. విద్యార్థులు మంచిగా చదువుకునేలా వారి తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. ఉపాధ్యాయులు గంగ, బాలకిషన్, విద్యార్థుల తల్లిదండ్రులు సత్తవ్వ, నర్సింలు తదితరులు మాట్లాడారు. అనంతరం దేవేందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ టీఆర్‌ఎస్ నాయకులు సుధాకర్‌రెడ్డి, మన్నె జలంధర్, అంజాగౌడ్, దుబ్బ రాజం తదితరులు పాల్గొన్నారు.