devendar reddy
-
‘హత్నూర’ను మెదక్‌లో కలపొద్దు
టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి దేవేందర్‌రెడ్డి హత్నూర: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన పునర్నివిభజన ముసాయిదా ప్రకారం హత్నూర మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కొనసాగించాలని, మెదక్ జిల్లాలో కలిపేందుకు ప్రయత్నిస్తే ప్రజా ఉద్యమం చేసేందుకు శ్రీకారం చుడతామని టీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి ఉమ్మన్నగారి దేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మంగాపూర్‌లో జెడ్పీటీసీ పల్లె జయశ్రీ,, టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి దేవేందర్‌రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. హత్నూర మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలిపితే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. కొందరు స్వార్థ రాజకీయ ప్రజాప్రతినిధులు ప్రజల ఓట్లతో గెలిచి... ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా హత్నూర మండలాన్ని మెదక్ జిల్లాలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. భవిష్యత్ తరాల కోసం హత్నూర మండలాన్ని సంగారెడ్డి జిల్లాలోనే కొనసాగించాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రెడ్డిఖానాపూర్ సర్పంచ్ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసం హత్నూర మండల ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండానే మెదక్ జిల్లాలో కలిపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఎమ్మెల్యేకు భయపడి ఆయన చెప్పినట్లు తల ఊపుతున్నారని అన్నారు. హత్నూర మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని మండల సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసి గతంలోనే కలెక్టర్‌కు ఇచ్చినట్లు గుర్తు చేశారు. హత్నూర మండలాన్ని మాత్రం సంగారెడ్డి జిల్లాలో కొనసాగించాలని, లేకుంటే పదవులకు రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొంటామన్నారు. జెడ్పీటీసీ పల్లె జయశ్రీ మాట్లాడుతూ హత్నూర మండలాన్ని ఎట్టి పరిస్థితుల్లో సంగారెడ్డి జిల్లాలోనే కొనసాగించాలన్నారు. 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న మెదక్‌లో కలపాలని చూస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో సర్పంచులు బంటుశ్రీనివాస్, ఈశ్వరమ్మ నర్సింలు, టీఆర్ఎస్ నాయకులు శ్రావణ్‌కుమార్, యాదగిరి, రాములు, పోచయ్య, ప్రవీణ్, సుధాకర్, మారుతిరాజు, బి.నర్సింహారెడ్డి, అర్జున్, రాజు, సురేందర్‌రెడ్డి, రాజీవ్‌గాంధీ, సద్గుణచారి పాల్గొన్నారు. -
ఆటపాటలతో చదివించాలి
విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దు ఉపాధ్యాయులకు టీఆర్ఎస్ నేత దేవేందర్‌రెడ్డి సూచన రామాయంపేట: విద్యార్థులకు అర్థమయ్యేలా స్వేచ్ఛాయుత వాతావరణంలో పాఠాలు బోధించాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, కోనాపూర్ సింగిల్ విండో చైర్మన్ దేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నస్కల్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పాఠశాలను విద్యాపరంగా మెరుగుపర్చడానికి తాను స్వయంగా ముగ్గురు వలంటీర్లను ఏర్పాటు చేసి వేతనాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా ఆటపాటల మధ్య చదువు చెప్పాలని సూచించారు. ఎంఈఓ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో వికలాంగ విద్యార్థులకు చదువు చెప్పించడానికి ప్రత్యేకంగా ఉపాధ్యాయుడిని నియమించినట్టు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు సుననీల్ మాట్లాడుతూ.. తమకు విద్యార్థుల తల్లిదండ్రులనుంచి పూర్తిస్థాయిలో సహకారం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు శారద మాట్లాడుతూ.. విద్యార్థులు మంచిగా చదువుకునేలా వారి తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. ఉపాధ్యాయులు గంగ, బాలకిషన్, విద్యార్థుల తల్లిదండ్రులు సత్తవ్వ, నర్సింలు తదితరులు మాట్లాడారు. అనంతరం దేవేందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ టీఆర్ఎస్ నాయకులు సుధాకర్‌రెడ్డి, మన్నె జలంధర్, అంజాగౌడ్, దుబ్బ రాజం తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ సభ కోసం భారీ ఏర్పాట్లు
మెదక్, న్యూస్‌లైన్: గుంట భూమి లేక గంజి నీళ్లు తాగుతున్న మాకు ప్రధాన మంత్రి భూములిస్తే మా బతుకులు మారుతాయనుకున్నాం. రెక్కలు ముక్కలు చేసుకుని రాళ్ల భూమిని రతనాలుగా మార్చినాం. తీరా పంటలు చేతికొచ్చాక నోటికాడి బువ్వను గద్ద తన్నుకు పోయినట్లు.. రజాకార్లోలె జంగ్లాతోళ్లు పొలాల మీద బడ్డరు. ఈ భూమి మాదంటూ కేసులు బెట్టిండ్రు.. గరీబులని సూడకుండా జరిమానాలేసిండ్రు. కనిపించిన నాయకుని కాళ్లు మొక్కినం.. ఆఫీసుల దగ్గర పడిగాపులు కాసినం. తొమ్మిదేళ్లవుతోంది. ఓట్లు వస్తున్నయ్,, పోతున్నయ్.. కాని మా పంచాయితీ తెగలేదు. మా పాణాలైన ఇస్తం కాని మా భూములు మాత్రం విడిచి పెట్టం’ అని అంటున్నారు గిరిజనులు. వివరాల్లోకెళ్తే.. మెదక్ మండలం తొగిట పంచాయతీ పరిధిలోని సుల్తాన్పూర్ తండా అది. పేరులోనే సుల్తాన్ ఉన్నా.. వారంతా గుంట భూమి లేని గరీబు గిరిజనులే. కాయకష్టం చేసుకుని బతుకులీడ్చే 90 మంది గిరిజనులకు 372,367 సర్వే నంబరులో గల 180 ఎకరాల భూమిని 2005లో ప్రధానమంత్రి చేతుల మీదుగా పంచిపెట్టారు. ఈ మేరకు పట్టాదార్ పాసుబుక్కు లిచ్చారు. ఇందిర జలప్రభ, సీఎల్డీపీ పథకాల కింద బోర్లు వేసి భూ అభివృద్ధి చేశారు. బీడు భూమిని బంగారు భూమిగా మార్చారు. కాని అందులోని 14 మంది గిరిజన కుటుంబాలను మాత్రం దురదృష్టం వెంటాడింది. శాంతి, సేవి, బుజ్జి, చందర్, విఠల్, రాంకీ, కమ్లీ తదితరుల పంటలు చేతికొచ్చే సమయానికి జంగ్లాతోళ్ళు ఊడిపడ్డారు. ‘ఈ భూమి జంగ్లాత్(ఫారెస్ట్)ది. మీరు మా భూమిని అక్రమంగా ఆక్రమించుకుని సాగు చేస్తున్నారు’ అంటు కేసులు పెట్టారు. ఆంతటితో ఆగక రూ 24 వేల నుంచి 30 వేల వరకు జరిమానాలు వేశారు. సాక్షాత్తూ ప్రధాని మంత్రి మన్మోహన్సింగ్ అందజేసిన పట్టాదార్ పాస్‌పుస్తకాలను చూపించినా వారు వెనక్కితగ్గలేదు. దీంతో కళకళ లాడిన ఆ 28 ఎకరాల భూమి బీళ్లుగా మారింది. ఇక ఆ గిరిజనులు కనిపించిన అధికారులను, నాయకులను వేడుకున్నా వారి వేదన అరణ్య రోదనే అయ్యింది. తొమ్మిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ వారి సమస్యకు పరిష్కారం అభించలేదు. ‘మళ్ళీ ఎన్నికలు వచ్చినయ్. కొత్త ఎంపీలు..ఎమ్మెల్యేలు వస్తరేమో.. కనీసం ఇప్పటికైనా మా బతుకులు మరుతాయా’ అంటూ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. మా సమస్య తీర్చేవారికే ఓటేస్తం. లేకుంటే తండా పొలిమేరల్లోకి రానివ్వమంటూ తమ అక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు.