చెన్నూర్ : పట్టణంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినిలకు సీఐ సతీశ్‌కుమార్ వాలీబాల్ కిట్టును బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థినిలు విద్యతో పాటు ఆటల్లోనూ రాణించాలన్నారు. క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థినిలకు ఎలాంటి క్రీడా సామగ్రి అవసరం ఉన్నా తమ వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎసై ్స చందర్, ఎంపీడీవో మల్లేశం, ఎంఈవో రాధాకృష్ణమూర్తి, పాఠశాల ప్రిన్సిపాల్ పద్మ, పీఈటీ అనిత పాల్గొన్నారు.