ఫుట్‌బాల్, క్రికెట్ వ్యక్తిగతమైన ఆటలు కావు. అవి జట్టు ఆటలు. జట్టులోని ఏ ఆటగాడి ఆట తీరునైనా అర్థం చేసుకోవడానికీ, అతడి నైపుణ్యాన్ని గుర్తించడానికీ మిగతా ఆటగాళ్లు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవడం అవసరమౌతుంది. అందుకే అవి స్టేడియంలలో చక్కగా కనిపిస్తాయి. అదే టెన్నిస్‌లో కెమెరాలు విడిగా ఒక క్రీడాకారుడిని అత్యుత్తమంగా చిత్రీకరిస్తాయి.
అతడు ఫ్రేము నిండుగా ఉన్నప్పుడు అతడి ప్రతి చర్య, ప్రతి కదలిక కనిపిస్తుంది. అతడి నిస్పృహ అయినా, అతడి విజయోద్వేగం అయినా స్పష్టంగా తెలిసిపోతుంది. దానికి తోడు, టెన్నిస్‌లో బంతిని అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు కొట్టడం లక్ష్యంగా ఉంటుంది. ఇద్దరు ఆటగాళ్ల నడుమ బంతి ప్రయాణ మార్గాలను కెమెరా అలవోకగా అనుసరిస్తుంది.
నేను క్రీడాకారుడిని కాదు. నిజం చెబు తున్నా, స్క్వాష్ తప్ప నేను ఏనాడూ ఏ ఆటా ఆడింది లేదు. క్రికెట్ అయితే నాకు ఒక దుర్భరమైన ధారావాహికలా తోస్తుంది. ఫుట్‌బాల్ మరీ అంత సాగతీతగా ఉండదు కనుక కొంచెం నయం అనుకుంటాను. ఎప్పుడైనా మర్యాద కోసం తప్ప ఆటల్ని నేను కనీసం చూడనైనా చూడను. కానీ టెన్నిస్... ఆహా! టెన్నిస్. అది నాకు మిగతా ఆటల్లా కాదు. మొత్తంగా అది వేరే కథ.
నొవాక్ జొకోవిచ్
మొన్న నేను ఫ్రెంచి ఓపెన్ ఫైనల్స్‌లో నొవాక్ జొకోవిచ్‌ను చూసినప్పుడు టెన్నిస్ అన్నది టెలివిజన్ కోసం తయారైన ఆట అని గ్రహించాను. ఫుట్‌బాల్, క్రికెట్ అలా కాదు. బహుశా అందుకేనేమో ఎప్పుడో గాని గ్రాండ్ స్లామ్ ఫైనల్స్‌ని నేను చేజార్చుకోను. ఇతర ఆటల వరల్డ్ కప్పులు ఏమైపోయినా నాకు పట్టదు.
టెన్నిస్‌లో కెమెరాలు విడిగా ఒక క్రీడాకారుడిని అత్యుత్తమంగా చిత్రీకరిస్తాయి. అతడు ఫ్రేము నిండుగా ఉన్నప్పుడు అతడి ప్రతి చర్య, ప్రతి కదలిక కనిపిస్తుంది. అతడి నిస్పృహ అయినా, అతడి విజ యోద్వేగం అయినా స్పష్టంగా తెలిసిపోతుంది. సంకల్ప బలం, స్థయిర్య క్షీణత వంటి అంతర్గత గుణాల విషయంలో కూడా ఇది నిజం.
కెమెరా ఆ గుణాలను వెలికి తీస్తుంది. దానికి తోడు, టెన్నిస్‌లో బంతిని అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు కొట్టడం లక్ష్యంగా ఉంటుంది. ఇద్దరు ఆటగాళ్ల నడుమ బంతి ప్రయాణ మార్గాలను కెమెరా అలవోకగా అనుసరిస్తుంది. ప్రతి విసురూ ఆట ఊపునుంచి వీక్షకుల చూపును తిప్పుకోనివ్వకుండా చేస్తుంది.
టెన్నిస్‌లా ఫుట్‌బాల్, క్రికెట్ వ్యక్తిగతమైన ఆటలు కావు. అవి జట్టు ఆటలు. అందువల్ల జట్టులోని ఏ ఆటగాడి ఆట తీరునైనా అర్థం చేసుకోడానికీ, అతడి నైపుణ్యాన్ని గుర్తించడానికీ మిగతా ఆటగాళ్లు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవడం మీకు అవసరమవుతుంది. అప్పుడు మాత్రమే మీరు బంతిని నియంత్రణలోకి తీసుకున్న ఆట గాడి మదిలోని వ్యూహాన్ని దృశ్యమానం చేయగలరు. అయితే ఒక ఆటగాడి మీద దృష్టిని నిలపడం అన్నది ఆటలోని తక్కిన భాగాన్నంతా కోల్పోయేలా చేస్తుంది.
అందుకే ఏ ఆటగాడు ఏ స్థానంలో ఉన్నదీ ఒకేసారి చూడా లంటే మైదానం మీకు తగినంత దూరంగా ఉండాలి. ఆ దూరం ఆట గాళ్లందర్నీ కనిపించేలా చేస్తుంది. అందుకే ఫుట్‌బాల్, క్రికెట్‌లు స్టేడియంలలో చక్కగా కనిపిస్తాయి. మానవ నేత్రం ఒక్క సారింపుతో అన్నిటినీ చూడగలదు. టీవీ కెమెరా అలా చూడలేదు. అనేక కెమెరాలు పని చేస్తున్నప్పటికీ ఏదైనా ఒక కెమెరాలో వచ్చిన పేలవమైన దృశ్యాన్ని కూడా అవి ఏవీ భర్తీ చేయలేవు.
టెన్నిస్‌లో ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు రాయల్ బాక్స్ నుంచి వింబుల్డన్‌ను తిలకిస్తున్నట్లయితే దూరం నుంచి క్రీడా మైదానం సంతృప్తికరమైన వీక్షణను ఇవ్వదు. ఒక వేళ మీరు పక్కల నుంచి చూస్తున్నట్లయితే మీ మెడ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి మళ్లీ ఎడమకు మళ్లుతూ ఉంటుంది. బంతిని ఏ మాత్రం నేలను తాకనివ్వని పోటాపోటీ షాట్‌ల సుదీర్ఘమైన నిడివి కూడా మీకు అలసటను కలిగించవచ్చు.
అదే టీవీలోనైతే రెండు మైదానాలు సమంగా కళ్ల ముందర ఉంటాయి. మీ మెడకు అసౌకర్యం కలుగదు. ఎందుకంటే మీరు స్క్రీన్‌కు ఎదురుగా కూర్చొని చూస్తుంటారు. బహుశా ఈ సదుపాయం వల్లనే దశాబ్దాలుగా నేను కొందరు టెన్నిస్ క్రీడాకారులను పిచ్చిగా అభిమానిస్తుండవచ్చు. వాళ్లు ఆడుతున్న ప్పుడు ఉత్కంఠగా చూస్తుంటాను.
వాళ్లు గెలిచి తీరాలని ఆశ పడ తాను. ఓడిపోతే కలత చెందుతాను. వాళ్ల విజయాలను, వైఫల్యాలను నావిగా మనసులోకి తీసుకుంటాను. ఇలా వ్యక్తిగతంగా తీసుకోవడం 70 లలో బార్న్ బోర్గ్, మార్టినా నవ్రతిలోవాలతో మొదలైంది. వారి స్థానాన్ని 2000–2009 మధ్య రోజర్ ఫెదరర్ ఆక్రమించాడు. ప్రస్తుతం నొవాక్ జొకోవిచ్.
1980లో బోర్గ్ సాధించిన ఐదవ వింబుల్డన్ విజయాన్ని నేనెప్ప టికీ మర్చిపోలేను. నాలుగో సెట్‌లో అతడి ప్రత్యర్థి జాన్ మెకెన్రో అతడికి ఏడు చాంపియన్‌షిప్ పాయింట్‌లను దక్కకుండా చేశాడు. అది అతడి ఆత్మను ఛిన్నాభిన్నం చేస్తుందని వ్యాఖ్యాతలు విశ్వసించారు. విజయానికి చేరువై కూడా విఫలం చెందిన విషయాన్ని మర్చి పోయి ముందుకు సాగిపోవడం సాధ్యం అయ్యే పని కాదు.
అయితే ఆ వ్యాఖ్యాతల అంచనా తలకిందులైంది. ఆ ఆటలో దృఢనిశ్చయంతో తలపడిన బోర్గ్ తన మోకాళ్లపై కూలబడటానికి ముందు ఐదో సెట్‌లో 8–6 తేడాతో విజయం సాధించాడు. అతడు చూపేది ఆ ఒక్క భావో ద్వేగమే. గెలిచిన ప్రతిసారీ అతడు అలాగే చేస్తాడు. అతడి వ్యక్తిత్వానికి సూచనప్రాయమైన సంకేతం ఇంకొకటి! టోర్నమెంటు జరుగుతున్నంత కాలం గడ్డం తీసేయకపోవడం!
1979లో సిమ్లాలో ఉండగా మా అమ్మమ్మ వాళ్ల ఇంట్లోని బ్లాక్ అండ్ వైట్ టీవీలో నేను బోర్గ్ ఆడుతున్న వింబుల్డన్ ఫైనల్ చూస్తు న్నాను. పాకిస్తాన్ టీవీ దానిని ప్రసారం చేస్తోంది. ఐదో సెట్ చివరిలో ఆనాటి అత్యంత భయానక సర్వర్‌లలో ఒకరైన రాస్కో టానాతో పోరాడుతున్న బోర్గ్‌కు మూడు చాంపియన్ షిప్ పాయింట్‌లు చేతిలో ఉండగా పాకిస్తాన్ టీవీ చానల్ అకస్మాత్తుగా వార్తల ప్రసారంలోకి మళ్లింది.
ఆ తర్వాత బోర్గ్ విజయం సాధించాడని తెలుసుకోడానికి ముందు అరగంట పాటు నేను తీరని వేదనతో టీవీ ముందు వేచి ఉన్నాను. ఆ నిర్దాక్షిణ్యమైన పీటీవీ, బులెటిన్‌లోకి ఆ వార్తను చేర్చడం సరికాదని భావించినట్లుంది.
ఇప్పుడు మళ్లీ నాలుగు వారాల తర్వాత వింబుల్డన్ నన్ను టీవీ తెర ముందుకు తీసుకురానుందా? మొన్నటితో 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన జొకోవిచ్ 24వ టైటిల్‌ను కూడా కోరుకుంటాడు.
అందులో సందేహం లేదు. కానీ అది అతడికి ఎంత ముఖ్యమో నాకూ అంత ముఖ్యమా? 1981లో బోర్గ్‌ను ఓడించినందుకు నేను మెకెన్రోని ద్వేషించాను. ఎస్.డబ్ల్యూ18 మైదానంలో జొకోవిచ్ ఓడిపోతే నా ప్రతి స్పందన ఇప్పుడూ అలాగే ఉండబోతుందా?
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment