రేపు ఆర్‌యూ కళాశాల వార్షికోత్సవం | tomorrow ru college anniversary | Sakshi
Sakshi News home page

రేపు ఆర్‌యూ కళాశాల వార్షికోత్సవం

Published Wed, Mar 22 2017 12:30 AM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM

tomorrow ru college anniversary

కర్నూలు(ఆర్‌యూ) : రాయలసీమ వర్సిటీ కాలేజీ వార్షికోత్సవాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు తెలిపారు. గుండెపోటుతో సోమవారం మరణించిన విద్యార్థి శ్రీనివాస్‌కు మంగళవారం నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా వివిధ ఆటల పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు అందజేస్తామన్నారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ రామ్‌ప్రసాద్‌ హాజరవుతున్నారన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు సునిత, రామ్‌ప్రసాద్, జయప్రతాప్, డీన్‌ సంజీవరావు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement