కేన్సర్ క్రీనీడల్లో క్రీడారంగం | money domination in games | Sakshi
Sakshi News home page

కేన్సర్ క్రీనీడల్లో క్రీడారంగం

Published Mon, Jun 8 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

కేన్సర్ క్రీనీడల్లో క్రీడారంగం

కేన్సర్ క్రీనీడల్లో క్రీడారంగం

ఫుట్‌బాల్, క్రికెట్లలోకి డబ్బు రంగ ప్రవేశం చేయడంతో ఆ రెండు క్రీడలూ రోగగ్రస్తమై పోయాయి. బెట్టింగ్ వంటి పరిశ్రమలు భారీగా బలిసిపోయాయి. కొన్ని చోట్ల అవి చట్టబద్ధమయ్యాయి. చట్టాలు వాస్తవికతకంటే వెనుకబడి ఉన్న చోట గోప్యంగా మారాయి. ఆట తీరులోని స్వల్ప మార్పులకు సైతం అంతంత డబ్బు అందుతుంటే గిరాకీ సరఫరాను ఊరిస్తుంది. తిను, తినిపించు అనే వ్యవస్థ దిగువన ఉన్నవారి సంగతి చూసుకుంటుంది. ఒక క్రీడ విశ్వసనీయతను కోల్పోయిందీ అంటే ఇక దానికి అర్థమే లేకుండా పోతుంది.
 
 20వ శతాబ్దంలో చాలా కాలంపాటు, టికెట్టు దొరకాలేగానీ చూడాల్సిన ఆటంటే పుట్‌బాలే. ఇక రేడియో ఉందీ అంటే వినాల్సిన ఆట క్రికెట్టే. భారత దేశం హాకీ అనే మూడో మార్గాన్ని నెలకొల్పగలిగేదే. కానీ మొదట్లో హఠా త్తుగా ఆ ఆటకు పట్టిన మహా వైభోగం తదుపరి తుస్సుమని పోయింది. అందుకు కారణాలేమిటనే విషయమై పండితులే ఆసక్తి కనబరచడం లేదు. కాబట్టి ప్రజలకూ అది అంతుబట్టనిదిగానే మిగిలింది. కాలం, క్రికెట్‌తో పోలి స్తే ఫుట్‌బాల్ వైపే నిలిచిన సమయమూ ఉండేది. ఫుట్‌బాల్ తక్కువ సమ యం పట్టే క్రీడ. ఆ క్లుప్తతే ఆటకు అనిశ్చితినెరుగని నెమ్మదికి హామీనిచ్చింది. ఆర్కిటిక్ చల్లదనమో లేదా ఎడారి వేడి వంటి విపరీత  పరిస్థితులైతే తప్ప వాతావరణం ఆ ఆటను చెడగొట్టలేదు. క్రికెట్, రష్యన్ నవలలాగా అంతులే నట్టుండేది. ఓ చిరు జల్లు సైతం ఆటకు అంతరాయం కలిగించగలిగేంత అని శ్చితమైనదిగా ఉండేది. దురదృష్టకరమైన ఆ పాత రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ వారం రోజులపాటూ సాగేది. ఐదు రోజుల  మధ్య ఒక రోజు ప్రాక్టీస్ కోసం. ఆ రోజున క్లబ్‌వాలా క్రికెటర్లు బార్‌లలో, పానప్రియులు కాని క్రికెట ర్లు దర్శనీయ స్థలాల సందర్శనలో ప్రాక్టీస్ చేసేవారు.  

 ఆరోజుల్లో క్రికెట్ ఉద్యోగస్తులకు ఆచరణ సాధ్యమైన పోటీగా ఉండేది కాదు. జీవితంలో పైకి రావాలనుకునే తాపత్రయం ఉన్న వారెవరికెవరికైనా గానీ క్రికెట్ సూచించదగినదిగా ఉండేది కాదు. కాబట్టే అమెరికన్లు దాన్ని వెర్రి మొర్రిదిగా కొట్టిపారేశారు. ఉద్యోగాలు చేసుకునే దానికి పూర్వ దశలోని యువతే ఎక్కువగా క్రికెట్‌కు ప్రేక్షకులు. ఇక కులీన వర్గాలకు ఉద్యోగానం తరం కబుర్లు చెప్పుకోడానికి, వాదులాడటానికి అవకాశాన్ని అందించేది.

 క్రికెట్, ఫుట్‌బాల్ వర్గ ప్రాతిపదికపై విడిపోయి ఉండేవారు. సర్వ సమ్మతమైన సత్యాలు చాలా వాటిలాగే అది కూడా పాక్షికంగా తప్పు. ఫుట్‌బాల్ ఆగ్రహావేశంతో కూడిన తెగ స్వభావం కలిగినది. కాబట్టే మన దేశంలో అది కూడా పలు వర్గాలను తప్పుకుని పోయింది. కొన్ని వర్గాలనే ఆవరించి ఉండిపోయింది. కలకత్తాకు చెందిన సంప్రదాయక ఫుట్‌బాల్ జట్లైన మోహన్ బగాన్, తూర్పు బెంగాల్, మొహమ్మదన్ స్పోర్టింగ్‌లు జాతిపరంగా పశ్చిమ బెంగాలీలు, తూర్పు బెంగాలీలు, ముస్లింలవి. తెగ వర్గాన్ని తనలో విలీనం చేసుకుంటుంది. న్యాయవాదులు, వంటవాళ్లు భుజా లురాసుకుంటూ సాగుతారు. ఆవేశకావేశాలు మరీ తీవ్రంగా ఉంటాయి. ఏ ‘బారీ మ్యాచ్’కు ముందు రోజైనా, ఆట తర్వాత గంటల తరబడీ సాగే మ్యాచ్ కు ముందటి, తర్వాతి శవపరీక్ష నివేదికలు బెంగాల్‌లోని పదుల వేల టీ దుకాణాలను పోషించేవి. అదే ఇంగ్లండ్‌లోనైతే  చర్చా ప్రవాహమూ, డబ్బూ కూడా పబ్బులకు చేరేది.

 భౌగోళికత, విధేయత అనే సమాంతర విశ్వాన్ని అందించింది. తరచూ ఆ విధేయత ఇటు నుంచి అటు మొగ్గుతుండేది. అయినా అదేమీ ఆవేశాలను తగ్గించేది కాదు. జనసమూహం ఒక పతాకం కోసం తపిస్తున్నారంటే ఇక ఆ కేంద్ర బిందువు ఏదైనా అందుకు పనికి వచ్చేదే అవుతుంది. ప్రజాపునాదిని పలు రెట్లు విస్తరింపజేసే మొట్టమొదటి ముఖ్య గుణకం 1960లనాటి ట్రాన్సిస్టర్ల విప్లవం. ఇక టెలివిజన్ విప్లవం దాన్ని చెక్కుచెదరనిదిగా మార్చే సింది. మార్కెట్టున్న చోట మార్కెటింగూ ఉంటుంది. వ్యాపార ప్రకటలున్న చోట డబ్బుంటుంది. డబ్బున్న చోట వృద్ధి, ప్రలోభం ఉంటాయి.  ప్రలోభం ఉన్న చోట దాన్ని నిరోధించలేని వారూ ఉంటారు. సంపద అవసరాలను సంతృప్తిపరచి, విలాసాల పట్ల వ్యామోహాన్ని తీర్చి దురాశను తగ్గిస్తుందని తర్కం చెబుతుంది.

కానీ మానవులు తార్కిక జీవులు కారు. వారి ప్రవర్తన సహజంగానే అందుకు విరుద్ధంగా ప్రవర్తించేలా చేయగలుగుతుంది. పేదలు తమకున్న దానిలోనే బతకడం నేర్చుకుంటారు. కాబట్టి వారు ధనవంతుల కంటే ఎక్కువ నిజాయితీగా ఉంటారు. ధనవంతులకు బంగారు గోళ్లతో వీపు గోక్కోవాలనే దురద ఎప్పుడూ ఉండేదే.
 ఫుట్‌బాల్, క్రికెట్ల పరిధిలోకి డబ్బు ముఖ్యమైనదిగా రంగ ప్రవేశం చేయడంతో ఆ రెండు క్రీడలూ రోగగ్రస్తమై పోయాయి. బెట్టింగ్ వంటి అనుబంధ పరిశ్రమలు భారీ కార్యకలాపాలుగా బలిసిపోయాయి. కాగలిగిన చోట అవి చట్టబద్ధమైనవే అయ్యాయి. చట్టాలు నిజమనే వక్రరేఖకు వెనుకనే మిగిలిపోయిన చోట అవి చాటుమాటు వ్యవహారమయ్యాయి. ఆట తీరులోని అతి స్వల్పమైన మార్పులకు సైతం అంత డబ్బు అందుతుండేటప్పుడు గిరాకీ సరఫరాను ఊరిస్తుంది. క్రీడాకారుల వృత్తి జీవిత కాలం స్వల్పం. వారిలో చాలామంది ఒక్కసారి తమ కెరీర్ ఒక్క ఏడుపుతో అలా మటుమాయమై పోయాక  వారి ముందు నిలిచేది శూన్యమే. ఒక జట్టులోని ఏ ఇద్దరు హీరోలకైనా తొమ్మిది మంది త్వరగానే మరపున పడిపోయేవారై ఉంటారు. బెంచ్‌పైనున్న రెండు డజన్ల మందిని ఎన్నడూ గుర్తుంచుకోరు.  ఫుట్‌బాల్, క్రికెట్ క్రీడలు రెండూ దశాబ్దాలుగా అవినీతి కాన్సర్ వ్యాధితో గుంజుకులాడుతున్నాయి.

ఆ వ్యాధికి  బలైపోయినవారి జాబితా పొడవైనది. ఒకప్పుడు దక్షిణ ఆఫ్రికా, భారత జాతీయ జట్లకు నాయకత్వం వహించిన తాత్కాలిక హీరోలు కూడా అందులో ఉన్నారు. తప్పులకు యూరోపియన్ ఫుట్‌బాల్ సమష్టి శిక్షల తీర్పులను అమలు చేసింది. తీర్పు వెలువడే ప్రతి ఒక్క ఘటనకూ పది తప్పించుకున్నాయని నిస్సంకోచంగా అనుకోవచ్చు. ఆ కంపు ఇంకా అలాగే కొడుతూనే ఉండటానికి కారణం అది అత్యున్నత స్థాయికి, పరిపాలనా యంత్రాంగం వరకు చేరతుండటమే. క్రికెట్ లోని అత్యంత శక్తివంతుల పేర్లు బుకీలతో కలసి గదులను పంచుకుంటాయి. తిను, తినిపించు అనే వ్యవస్థ కామెంటేటర్లు, మీడియా పండిత వర్గాలు సహా దిగువన ఉన్నవారందరి సంగతీ చూసుకుంటుంది.
 పదిహేడేళ్లపాటూ ఫీఫా(అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య) అధిపతిగా ఉన్న సెప్ బ్లాటర్ అధికారంలో ఉండగా డబ్బు రాజ్యమేలింది. ఆయన బండారం కాస్తా బట్టబయలు కావడంతో ప్రపంచ ఫుట్‌బాల్ గిలగిలలాడుతోంది. అది పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యం. ఒక  ప్రపంచ కప్పు మ్యాచ్ ఏర్పాటంటే హోదాకు పాస్‌పోర్ట్‌గా మారింది. ఫుట్ బాల్ క్రీడను నియంత్రించే కొందరి గుత్తాధిపత్య ప్రజాస్వామ్యం నుంచి ఆ విశేష హోదాను సంపాదించడంలో విజయవంతమయ్యే మార్గాన్ని కొనుక్కో డానికి ఎందరో సిద్ధంగా ఉంటారు. ఇలా వేలానికి దిగేవాళ్లలో ఆ తర్వాత నష్టపోయేవారు ఎవరూ ఉండరు... ఒక్క ఆ క్రీడ తప్ప.  వమాన భారం భరించలేక బ్లాటర్ తన ఖడ్గంపై పడి మరణించలేదు. చాలా మంది పరిస్థితి నరాలు తెగిపడేంత ఉత్కంఠతో ఉన్నది కాబట్టే ఆయన్ని శిఖరం మీది నుంచి నెట్టారు.

ఒకప్పుడు క్రీడా స్ఫూర్తికి మూలంగా ఉండిన క్రీడ నేడు వంచనాత్మకతకు మించి మరేదైనా అయితే మనజాలదు. ఒక క్రీడ విశ్వసనీయతను కోల్పోయిందీ అంటే ఇక దానికి అర్థమే లేకుండా పోతుంది. అద్భుత మేధో ప్రమాణాలకు చేరిన అవినీతికి అడ్డుకట్ట వేయడానికి క్రికెట్ చాలానే చేసింది. బ్లాటర్ నిష్ర్కమణైనా ఫుట్‌బాల్ క్రీడలో రాజును మార్చడానికి మించిన వ్యవస్థాగతమైన మార్పులకు ప్రేరణకాగలదని ఎవరైనాగానీ ఆశించగలరు.  అప్పుడే ఫుట్‌బాల్, క్రికెట్ 21వ శతాబ్దపు ప్రధాన  క్రీడలుగా మిగులుతాయి.     
 

(వ్యాసకర్త: ఎంజే అక్బర్.. సీనియర్ సంపాదకులు )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement