రాష్ట్ర స్థాయి విద్యాసదస్సు, కబడ్డీ పోటీల బ్రోచర్ల ఆవిష్కరణ
పెద్దాపురం :
ఈనెల 15న విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి విద్యాసదస్సు, వచ్చే నెల 6 నుంచి 9వ తేదీ వరకు సామర్లకోటలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల బ్రోచర్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ఆదివారం ఇక్కడ ఆవిష్కరించారు. సామర్లకోట ఎన్‌బీఎస్‌ఆర్ క్లబ్, జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు 13 జిల్లాల నుండి వచ్చే క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. తెలుగు ఉపా«ధ్యాయ సంఘం ఆ««దl్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో ‘ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ–ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తారని ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ కె.జయరామ్ మంత్రి రాజప్పకు వివరించారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, వైస్ చైర్మన్ త్సలికి సత్యభాస్కరరావు, కబడ్డీ సంఘం జిల్లా అధ్యక్షుడు డి.మురళి, ఉపాధ్యాయ సంఘం జిల్లా కన్వీనర్ ఎం.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.