ఆటపాటలతో కూడిన విద్యతో విజ్ఞానం
హెచ్.అరుణ్‌కుమార్‌తో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో చక్రవర్తి మాట్లాడుతూ, గ్రామీణ చిన్నారులకు ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా విద్యాబోధన అందించడం అభినందనీయమన్నారు. యూనిసెఫ్ ప్రతినిధి రూతూలియానో మాట్లాడుతూ, చిన్నారుల విద్యాభివృద్ధిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం మంచి పరిణామమని అన్నారు. గాడిమొగ గ్రామాన్ని
శిశు సంక్షేమ శాఖ కమిషనర్ చక్రవర్తి
తాళ్లరేవు : చిన్నారులకు ఆటపాటలతో కూడిన ప్రాథమిక విద్యను అందించడంవల్ల మంచి విజ్ఞానం సమకూరుతుందని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కె.చక్రవర్తి అన్నారు. గాడిమొగలో రూ.10 లక్షలతో ఆధునికీకరించిన ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రాలను కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్‌తో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో చక్రవర్తి మాట్లాడుతూ, గ్రామీణ చిన్నారులకు ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా విద్యాబోధన అందించడం అభినందనీయమన్నారు. యూనిసెఫ్ ప్రతినిధి రూతూలియానో మాట్లాడుతూ, చిన్నారుల విద్యాభివృద్ధిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం మంచి పరిణామమని అన్నారు. గాడిమొగ గ్రామాన్ని దత్తత తీసుకున్న మహిళా శిశు సంజీవని మిషన్ కన్వీనర్, కలెక్టర్ సతీమణి శ్రీదేవి ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రాల్లోని పలు విభాగాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు, ఎంపీపీ టి.అనంతలక్ష్మి, జెడ్‌పీటీసీ పి.రామలక్ష్మి, సర్పంచ్ కె.సూర్యాకాంతం, ఎంపీడీఓ చినబాబు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.