ముగిసిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలు | end distric games | Sakshi
Sakshi News home page

ముగిసిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలు

Published Wed, Aug 3 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

తెలంగాణ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ వరంగల్‌ ఆధ్వర్యంలో మంగళవారం హన్మకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జిల్లాస్థాయి 33వ సబ్‌జూనియ ర్స్‌ బాలికల ఎంపిక పోటీలను నిర్వహించా రు.

వరంగల్‌ స్పోర్ట్స్‌ : తెలంగాణ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ వరంగల్‌ ఆధ్వర్యంలో మంగళవారం హన్మకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జిల్లాస్థాయి 33వ సబ్‌జూనియ ర్స్‌ బాలికల ఎంపిక పోటీలను నిర్వహించా రు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 200 మంది క్రీడాకారిణిలు హాజరైనట్లు అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్‌ తెలిపారు. ప్రతిభ కనబరిచిన పి.అర్చన, డి.స్వప్న, పి.నవ్య, ఎం.వెన్నెల లు (జెడ్పీఎస్‌ఎస్‌ నందిగామ), ఇ.మేఘన. జి.శిరీ ష (జెడ్పీఎస్‌ఎస్‌ తిమ్మంపేట), శిరీష (జెడ్పీఎస్‌ఎస్‌ ధర్మసాగర్‌), బి.సాయిసృజన(ఓరుగల్లు హైస్కూల్‌), ఎంపికయ్యారు. అలాగే ఎ.అమూల్య(జెడ్పీఎస్‌ఎస్‌ లక్నెపల్లి), ఎం.వర్ష (గ్రీన్‌వుడ్‌ హైస్కూల్‌), స్పందన(జెడ్పీఎస్‌ఎస్‌ పైడిపెల్లి), టి.అనూష(జెడ్పీఎస్‌ఎస్‌ ఆకునూరు) ఎం.సాత్విక ఏంజిల్‌(ఆక్స్‌ఫర్డ్‌ హై స్కూల్‌), బిసుప్రియ( జెడ్‌పీఎస్‌ఎస్‌ ఆకూనూరు), ఎ ఐశ్వర్య(ఎస్‌ఆర్‌ డిజీ స్కూల్‌), డి రవళి(ఓరుగల్లుహైస్కూల్‌)లు ఎంపికైనట్లు తె లిపారు. వీరు ఈ నెల 6,7,8 తేదీల్లో జేఎన్‌ఎస్‌లో జరిగే రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్‌ పో టీల్లో పాల్గొంటారని పవన్‌కుమార్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement