distric
-
దేశంలో అత్యల్ప అక్షరాశ్యత గల జిల్లా ఏది?
దేశంలో అత్యధిక విద్యావంతులు కలిగిన రాష్ట్రం గురించి ప్రస్తావించినప్పుడు కేరళ పేరు గుర్తుకు వస్తుంది. అయితే భారతదేశంలో అతి తక్కువ విద్యావంతులు కలిగిన జిల్లా ఏదో తెలుసా? భారతదేశంలో జనాభా గణన 2011లో నిర్వహించారు. ఇది దేశ జనాభాతో పాటు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్థితిగతులు సమాచారాన్ని అందించింది. ఇలా సేకరించిన డేటాలో ముఖ్యమైన అంశం వివిధ ప్రాంతాలలోని జనాభా, అక్కడి అక్షరాస్యత రేటు. భారతదేశంలో అతి తక్కువ విద్యావంతులు గల జిల్లాలను గుర్తించడానికి ఈ డేటా ఉపకరిస్తుంది. భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత శాతం కలిగిన జిల్లా అలీరాజ్‌పూర్. ఇది మధ్యప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ సగటు అక్షరాస్యత రేటు 36.10 శాతం మాత్రమే. ఈ జిల్లాలలో మగవారిలో అక్షరాస్యత రేటు 42.02 శాతం, స్త్రీలలో 30.29 శాతంగా ఉంది. భారతదేశంలో అతి తక్కువ విద్యావంతులు ఉన్న రెండవ జిల్లా విషయానికొస్తే.. అది ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్. ఈ జిల్లాలో సగటు అక్షరాస్యత రేటు 40.86 శాతం. ఇందులో పురుషుల అక్షరాస్యత 50.46 శాతం. స్త్రీల అక్షరాశ్యత 31.11 శాతంగా ఉంది. అత్యల్ప విద్యావంతులు కలిగిన మూడవ జిల్లా దంతేవాడ. ఇది చత్తీస్‌గఢ్‌లో ఉంది. ఇక్కడ సగటు అక్షరాస్యత రేటు 42.12 శాతం. పురుషుల అక్షరాశ్యత శాతం 51.92 శాతం. స్త్రీలలో 35.54 శాతం అక్షరాశ్యత ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఝబువా సగటు అక్షరాస్యత రేటు 43.30 శాతం. ఇది దేశంలో నాల్గవ అత్యల్ప అక్షరాస్యత కలిగిన జిల్లా. ఇక్కడ పురుషులలో 52.85 శాతం, మహిళలలో 33.77 శాతం అక్షరాశ్యత కలిగినవారున్నారు. భారతదేశంలో అతి తక్కువ విద్యావంతులు ఉన్న ఐదవ జిల్లా ఒడిశాలోని నబరంగ్‌పూర్. ఇక్కడ నమోదైన సగటు అక్షరాస్యత రేటు 46.43 శాతం. ఇది కూడా చదవండి: రాజస్తాన్‌లో కొత్త పరిణామం.. బీజేపీ, కాంగ్రెస్‌లకు గుబులు -
పలు జిల్లాల్లో వైఎస్ఆర్ 12 వ వర్ధంతి కార్యక్రమాలు
-
కొత్తగా 12 మండలాలు
మూడు ఔట్.. మూడు ఇన్ పునర్విభజనలో అనూహ్య మార్పులు తొర్రూరు, స్టేషన్‌ఘన్‌పూర్‌కు డివిజన్ హోదా జిల్లాల పునర్విభజన ప్రక్రియలో వరంగల్ జిల్లాలో కొత్తగా 12 మండలాలు రాబోతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన టీఆర్ఎస్ నేతలతో సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగష్టు 22న ప్రకటించిన ముసాయిదా నోటిఫికేషన్లో ఇందులో 6 మండలాలను పొందుపరిచారు. తాగాగా మరో ఆరు మండలాలు ప్రకటించారు. వీటితో పాటు తొర్రూరు, స్టేషన్ఘన్పూర్‌లను రెవెన్యూ డివిజన్లుగా చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కొత్త మండలాలు జిల్లాల పునర్విభజన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఎక్కడికక్కడ ప్రజాసంఘాలు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగించాయి. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. గత ఆగష్టు 22న వెలువరించిన జిల్లాల పునర్విభజనలో కాజీపేట, ఖిలావరంగల్, ఐనవోలు, వేలేరు, చెల్పూరు, ఇల్లంతకుంట మండలాలను ప్రకటించగా, కొత్తగా దంతాలపల్లి, పెద్దవంగర, తరిగొప్పుల, చిన్నగూడూరు, కొమురవెల్లి, టేకుమట్లను మండలాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్తగా ఏర్పాటు కానున్న 12 మండలాల్లో వరంగల్ జిల్లాలో 5 , జయశంకర్ జిల్లాలో 1, జనగామలో 3, మహబూబాబాద్‌లో 2 , సిద్ధిపేటలో ఒక మండలం కలువనున్నాయి. మారనున్న సరిహద్దులు ముసాయిదా నోటిఫికేషన్లో ప్రకటించిన జిల్లాల సరిహద్దులు మారేందుకు ఆస్కారం ఉంది. కొత్తగా జనగామ జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ఉన్న మూడు మండలాలు జనగామ, జయశంకర్ జిల్లాల్లో కలపాలని నిర్ణయించింది. నల్గొండ జిల్లాలోని గుండాల మండలాన్ని చేర్చాలని నిర్ణయించారు. ముసాయిదాలో ఈ మండలం యాదాద్రి జిల్లాలో ఉంది. ఖమ్మం జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాలను జయశంకర్ జిల్లాలో కలపాలని నేతలు సూచించగా సీఎం సానుకూలంగా స్పందించారు. ముసాయిదాలో ఈ మండలాలు కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. ముసాయిదాలో హన్మకొండ జిల్లాలో పేర్కొన్న జమ్మికుంట, హుజురాబాద్ మండలాలు తిరిగి కరీంనగర్ జిల్లాలోకి వెళ్తున్నాయి. ప్రతిపాదిత సిద్దిపేట జిల్లాలో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలు కలుస్తున్నాయి. జిల్లాల పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్లో తొర్రూరు, స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రాలుగా ఉన్నాయి. ఇప్పుడు జనగామ జిల్లాలో స్టేషన్ఘన్పూర్ను రెవెన్యూ డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేశారు. ప్రతిపాదిత మహబూబాబాద్ జిల్లాలో ఉన్న తొర్రూరును డివిజన్ చేయాలనే డిమాండ్‌కు గతంలో సీఎం సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. -
అను‘బంధం’ పిలుస్తోంది..!
అన్నాచెల్లెల అనుబంధం రాఖీ అనే రెండక్షరాలతో ద్విగుణీకృతమవుతోంది.. అక్కాతమ్ముళ్ల ఆప్యాయతకు మారుపేరుగా నిలుస్తోంది.. సోదరసోదరీభావాలను వ్యక్త పరుస్తోంది.. అన్నింటికీ మించి రక్తసంబంధ బాంధవ్యాలను గుర్తుకు తెస్తోంది.. కష్టాలు ఎదురైనా, సుఖసంతోషాలతో ఎల్లలు దాటిపోయినా రాఖీ పండుగ నాడు కలుసుకుని ఆనందం పంచుకోవాలని గుర్తు చేస్తోంది. యాంత్రిక జీవనం సాగిస్తున్నా.. ఆధునిక శాస్త్రసాంకేతిక పద్ధతులు అందిపుచ్చుకుని కొందరు రాఖీలను చేరవేస్తుండగా చాలామంది స్వయంగా తమ అన్నలు, తమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు సొంతూళ్లబాట పడుతున్నారు. గురువారం జరిగే రాఖీ పౌర్ణమి సందర్భంగా వివిధ వర్గాలు, అనేక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. – సాక్షి నెట్వర్క్ అన్నకోసం అమెరికాకు.. – వి.వైష్ణవి, వేములవాడ మా అన్నయ్య వికాస్ అమెరికాలో సాఫ్ట్‌వేట్ ఉద్యోగి. అంతదూరం వెళ్లడం కుదరదు కనుక రాఖీని స్పీడ్ పోస్టులో అమెరికా పంపించా. అదే స్పీడ్‌పోస్టు ద్వారా మా అన్నాయ్య మాకు స్వీట్ లేదా గిఫ్ట్‌లు పంపిస్తుంటారు. విదేశాల్లో ఉన్నా అన్నకోసం.. – స్వాతి, బర్మింగ్‌హోమ్, అమెరికా బర్మింగ్‌హోమ్‌లో ఉన్నత చదువు కొనసాగిస్తున్న. మా అన్నయ్య వేణు వేములవాడలో ఉంటున్నరు. అమెరికా నుంచి ఆయనకు నేను రాఖీ పంపించిన. అన్నాచెల్లెల అనుబంధానికి ఇది గుర్తు. రాఖీ కట్టలేకపోతున్న – మాధవి, సీఐ, వేములవాడ రూరల్ మాది పోలీసు కుటుంబం. మా పెద్దన్నయ్య వీవీ రమణమూర్తి హుజూరాబాద్ సీఐ. చిన్నన్నయ్య వి.యుగంధర్ అనంతపూర్ జిల్లా రామగిరి సీఐ. మేం ఎప్పుడు ఎక్కడ డ్యూటీ చేస్తామో తెలియదు. నేను కృష్ణా పుష్కరాల్లో ఉండడంతో వారికి రాఖీ కట్టలేకపోతున్న. అన్నయ్యలు బాగుండాలని ఇక్కడ్నుంచే మొక్కుకుంట. చిన్నాన్న కుమారులకు రాఖీలు కడతా – ఉమారాణి, ఏఈవో, రాజన్న ఆలయం, వేములవాడ మేం నలుగురం అక్కా–చెల్లెళ్లం. అన్నదమ్ములు లేరు. కరీంనగర్‌లోని మా చిన్నాన్న కుమారులకు రాఖీలు కడతా. లేదా వాళ్లే ఇక్కడికి వస్తరు. మా కొలీగ్స్ కూడా రాఖీలు కట్టి అన్నాచెల్లెల అనుబంధం గుర్తు చేసుకుంట. హ్యాపీగా ఉంటది – గంగం గీతారాణి, హోమియోవైద్యురాలు, ముల్కనూర్, భీమదేవరపల్లి మాది వరంగల్ జిల్లా నర్మెట మండలం అమ్మపూర్. మా అక్కయ్య సంధ్యారాణి, నేను, తమ్ముడు గోపాల్‌కృష్ణారెడ్డి. తమ్ముడు ఎల్కేజీ నుంచి మెడిసిన్ వరకు నావద్దే ఉన్నాడు. అమ్మకంటే ఎక్కువ నా వద్ద ఉంటున్నాడు. దాదాపు ముప్పయి ఏళ్లుగా తమ్ముడికి రాఖీ కడతా. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నా వెళ్లి కట్టిరావడం హ్యాపీ. ============================================================== కరీంనగర్ కల్చరల్ ముగ్గురికి రాఖీలు– డాక్టర్ ఆకుల శైలజ, కరీంనగర్ మాది వరంగల్. అత్తయ్య వాళ్లది కరీంనగర్. నాకు అన్నదమ్ములు లేరు. కరీంనగర్లో ఆస్పత్రి ప్రారంభించినప్పచి అనెస్తీషియన్ ఓంప్రసాద్కు రాఖీ కడుతున్న. పదిహేనేళ్ల కిత్రం శ్రీకృష్ణ మందిరంలో పరిచయమై అక్కయ్య అని పిలిచే లెక్చరర్ శ్రీనివాస్‌రెడ్డి, మెడికల్ రిఫ్ శ్రీకాంత్‌కు ఏడాదిగా రాఖీలు కడుతున్న. అనుబంధానికి వారిధి – ఆర్.నాగలక్ష్మి, ఏఎంవీఐ, సిరిసిల్ల మాది కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. తమ్ముడు నరేశ్ బెంగళూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఒక అక్క ఉంది. తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు. నాకు ఉద్యోగం రాకముందు నుంచీ రాఖీ పండుగను ఆనందంగా జరుపుకునేవాళ్లం. విధినిర్వహణలో భాగంగా ఈసారి తమ్ముడికి రాఖీ కట్టే అవకాశం లేకుండాపోయింది. ఈసారి మా ఇంట్లోనే పండుగ – వి.స్వరూపరాణి, ఆర్వో, సిరిసిల్ల మున్సిపాలిటీ మాది సొంతూరు సిరిసిల్ల. అమ్మానాన్నలు గాలిపల్లి లక్ష్మి– సత్యనారాయణ. మేం ఆరుగురం అక్కాచెల్లెల్లం. తమ్ముడు చిన్నోడు హరీశ్. హైదరాబాద్‌లో హార్డ్‌వేర్ ఉద్యోగి. తమ్ముడంటే మాకేంతో ఇష్టం. ఈసారి రాఖీపండుగ కరీంనగర్‌లోని మా ఇంట్లోనే జరుపుకుంటం. ఒక్కడే తమ్ముడు – వెంకటలక్ష్మి, మున్సిపల్ ఆర్ఐ , సిరిసిల్ల మాది ఖమ్మం. నాకు ఒక్కడే తమ్ముడు క్రాంతికుమార్. రాఖీపండుగను ఎంతో వేడుకగా చేసుకుంటాం. ఈసారి పండక్కి వెళ్లలేకపోతున్నాను. తమ్ముడు రాఖీ కట్టి మురిసిపోయేదాన్ని. హ్యాపీగా ఫీలవుతాం – విజయలక్ష్మి, ఎక్సైజ్ సీఐ, హుస్నాబాద్ నాకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు అన్నదమ్ములు. అన్నయ్యలకు రాఖీలు కట్టడం హ్యాపీగా ఫీలవుతం. వృత్తిరీత్యా ఎక్కడ ఉన్నా రాఖీపండుగ రోజు కుటుంబసభ్యులమందరం కలుసుకుంటాం. రక్షాబంధన్ వేడుకులు జరుపుకుంటం. పోస్ట్‌లో పంపిస్త– జానకి, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ, హుస్నాబాద్ నాకు ఇద్దరు అన్నదమ్ములు. వీలును బట్టి నేరుగా వెళ్లి రాఖీ కడతా. జాబ్ ఒత్తిడితో ఒక్కోసారి పోస్ట్‌లో రాఖీతోపాటు స్వీట్ పంపిస్తా. ఫోన్ ద్వారా శుభాంక్షలు తెలుపుతా. -
ముగిసిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో మంగళవారం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జిల్లాస్థాయి 33వ సబ్‌జూనియ ర్స్ బాలికల ఎంపిక పోటీలను నిర్వహించా రు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 200 మంది క్రీడాకారిణిలు హాజరైనట్లు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన పి.అర్చన, డి.స్వప్న, పి.నవ్య, ఎం.వెన్నెల లు (జెడ్పీఎస్ఎస్ నందిగామ), ఇ.మేఘన. జి.శిరీ ష (జెడ్పీఎస్ఎస్ తిమ్మంపేట), శిరీష (జెడ్పీఎస్ఎస్ ధర్మసాగర్), బి.సాయిసృజన(ఓరుగల్లు హైస్కూల్), ఎంపికయ్యారు. అలాగే ఎ.అమూల్య(జెడ్పీఎస్ఎస్ లక్నెపల్లి), ఎం.వర్ష (గ్రీన్వుడ్ హైస్కూల్), స్పందన(జెడ్పీఎస్ఎస్ పైడిపెల్లి), టి.అనూష(జెడ్పీఎస్ఎస్ ఆకునూరు) ఎం.సాత్విక ఏంజిల్(ఆక్స్ఫర్డ్ హై స్కూల్), బిసుప్రియ( జెడ్పీఎస్ఎస్ ఆకూనూరు), ఎ ఐశ్వర్య(ఎస్ఆర్ డిజీ స్కూల్), డి రవళి(ఓరుగల్లుహైస్కూల్)లు ఎంపికైనట్లు తె లిపారు. వీరు ఈ నెల 6,7,8 తేదీల్లో జేఎన్ఎస్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ పో టీల్లో పాల్గొంటారని పవన్‌కుమార్ తెలిపారు. -
సిద్దిపేట సిద్ధం!
కొలిక్కి వచ్చిన నైసర్గిక స్వరూపం 36 అంశాలు కీలకం 30 మండలాలతో జిల్లా ఏర్పాటుకు నిర్ణయం ‘కొమరెల్లి మల్లన్న’ సిద్దిపేటలోకే.. సమాచార సేకరణలో యంత్రాంగం బిజీబిజీ సిద్దిపేట జిల్లా ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాకు సంబంధించిన వివరాల సేకరణలో పలు శాఖల అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాల విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షతన కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. మొత్తం ఆరు విభాగాల్లో 36 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)కు పంపనున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సిద్దిపేట జిల్లా దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలతో పాటు పక్కనున్న వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి కొంత భాగాన్ని కలుపనున్నారు. పూర్తి నియోజకవర్గాలతో సంబంధం లేకుండా సిద్దిపేట పట్టణ ప్రాంతానికి సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలను సిద్దిపేట జిల్లా పరిధిలోకి తీసుకువచ్చే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 30 మండలాలతో జిల్లాను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పూర్తి నియోజకవర్గం, మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, బెజ్జంకి, ఉస్నాబాద్ మండలాలు, వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గంలోని చేర్యాల , బచ్చన్నపేట, నర్మెట మండలాలతో పాటు మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేట మండలాన్ని కలిపే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఇదే జరిగితే వరంగల్ జిల్లాలోని ప్రఖ్యాత కొమురవెల్లి మల్లన్న పుణ్య క్షేత్రం సిద్దిపేట జిల్లాలోకే వస్తుంది. మెదక్ జిల్లాను కూడా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికి అది ఇప్పట్లో సాధ్యయేటట్లు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా.. గత నెల 26 నాటికే జిల్లా సమాచారం పంపాల్సి ఉన్నా సమాచార సేకరణలో ప్రభుత్వ శాఖలు జాప్యం చేస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం 12 శాఖలకు సంబంధించిన సమాచారమే వచ్చిందని, కీలక శాఖల సమాచారం రాలేదని తెలుస్తోంది. వారం రోజుల్లో నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారం, పది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అడిగిన విధంగా సమాచారాన్ని పంపేందుకు అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఆరు విభాగాలుగా సమాచార సేకరణ ... ఒకటో విభాగం: రెవెన్యూ డివిజన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీ సీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ల వివరాలు... జిల్లాలో ఉన్న ఇళ్లు, గ్రామీణ, పట్టణ జనాభా ఎంత? లింగ నిష్పత్తి, అక్షరాస్యత వివరాలు, కార్మికుల సంఖ్య. రెండో విభాగం: వివిధ ప్రాంతాల చారిత్రక అనుబంధం, భౌగోళిక, సహజ వనరులు, అటవీ సంపద వివరాలు, సాగుకు యోగ్యం కాని భూమి, వ్యవసాయేతర అవసరాల్లో ఉన్న భూమి వివరాలు మూడో విభాగం: జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, డైట్ కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లు, బీఈడీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్, ఫార్మా, మెడికల్ కళాశాలల వివరాలు, జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, వన్యప్రాణి సంరక్షణ, చారిత్రక ప్రాముఖ్యత. నాలుగో విభాగం: పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, జౌళి మిల్లులు, లెదర్, చెక్కబొమ్మలు, పేపర్ పరిశ్రమలు, మీడియా ప్రచురణ కేంద్రాలు, పెట్రో ఉత్పత్తులు, రసాయన, ఔషధ పరిశ్రమలు, రబ్బర్, ప్లాస్టిక్, మెటల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్, మోటార్ వెహికిల్స్, వేర్‌హౌజింగ్, ఫర్నీచర్ పరిశ్రమలు. ఐదో విభాగం: విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ లెక్కలు, రోడ్ల వివరాలు, జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు, రైల్వే స్టేషన్లు, ఎన్ని కిలోమీటర్ల లైన్ ఉంది, ఆర్టీసీ డిపోలు, వాటి ఆర్థిక స్తోమత, పోస్టాఫీసులు, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్లు, పబ్లిక్ టెలిఫోన్లు, టెలిఫోన్ కనెక్షన్లు, జిల్లాలో ఆస్తిపన్ను రాబడి వివరాలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయ వివరాలు, నిత్యావసరాల పన్నులు, ఎక్సైజ్, వాణిజ్య శాఖల పన్నులు, మోటారు వాహనాల పన్నులు, బ్యాంకులు, డిపాజిట్లు, కార్మిక, ఉపాధి వివరాలు, వ్యవసాయ భూముల పంపిణీ, బలహీనవర్గాలకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం, మంచినీటి సరఫరా పథకాలు, రేషన్‌షాపులు, పెట్రోలు బంకులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, గ్యాస్ఏజెన్సీలు, రైస్‌మిల్లులు, కిరోసిన్ డీలర్లు, స్వయంసహాయక సంఘాల పనితీరు, ఉపాధి హామీ అమలు, మున్సిపాలిటీలు, జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీల ఆదాయ, వ్యయాలు, రైతు బజార్లు, వ్యవసాయ మార్కెట్లు, గోడౌన్లు, పోలీసు సిబ్బంది, స్టేషన్లు, జైళ్లు, ఖైదీలు, నేరాల సంఖ్య. ఆరో విభాగం: సరిహద్దులతో కూడిన మ్యాపు తయారీ.