క్రీడామైదానంలోకి సేద్య విజ్ఞానగణం
-
వ్యవసాయ శాస్త్రవేత్తలు,అధ్యాపకుల పోటీలు ప్రారంభం
-
రాజమహేంద్రవరంలో మూడు రోజుల నిర్వహణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
నిత్యం వ్యవసాయ రంగంపై పరిశోధనలు, విద్యార్థులకు బోధనలతో నిమగ్నమయ్యే వారంతా క్రీడామైదానంలో కాలుపెట్టారు. ఆచార్య ఎ¯ŒSజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని వ్యవసాయ కళాశాల అ«ధ్యాపకులు, శాస్త్రవేత్తల రాష్ట్రస్థాయిలో ఆటల పోటీలు స్థానిక వ్యవసాయ కళాశాల (ఎస్‌కేవీటీ కళాశాల క్రీడా మైదానం) వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. మూడురోజుల జరిగే పోటీలను విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యుడు, కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ ప్రారంభించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అ«ధ్యాపకులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 మంది పైగా హాజరయ్యారు. తొలిరోజు క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్, రాత, ప్రసంగ పరీక్ష పోటీలు నిర్వహించారు. విజేతలకు ఆదివారం ముగింపు సభలో బహుమతులు అందజేయనున్నారు.