
లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ రద్దవ్వడంతో సెలబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యారు. అనూహ్యంగా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నారు. అంతేకాకుండా అప్పడప్పుడు సోషల్ మీడియాలో వారు రోజు ఇంట్లో చేస్తున్న పనులు అదేవిధంగా ఈ కరోనా సమయంలో కచ్చితంగా పాటించాల్సినవి అభిమానులకు సూచిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ఈ లాక్‌డౌన్ సమయంలో చేసిన యోగా వీడియోలు, ఇంట్లో సరదాగా చేసిన వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా తన తమ్ముడు అమన్‌తో కలిసి చేసిన అల్లరికి సంబంధించిన మరో వీడియోను షేర్ చేసింది. తన చిన్నప్పుడు ఆడుకున్న అందమైన ఆటలన్నింటిని సోదరుడితో కలిసి ఇంట్లోనే ఆడింది రకుల్.‘ఇలాంటి సమయం మిమ్మల్ని బాల్యంలోకి తీసుకెళ్తుంది’అంటూ కామెంట్ కూడా జతచేసింది. చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
చదవండి:
‘ఆచార్య’ నుంచి తప్పుకోవడం లేదు
‘నాకు కరోనా రాలేదు.. వచ్చింది మలేరియా’
Comments
Please login to add a commentAdd a comment