
రకుల్ ప్రీత్‌సింగ్
లాక్‌డౌన్ వేళ రకుల్ ప్రీత్‌సింగ్ రోడ్డు మీదకొచ్చారు. ఆమె చేతిలో ఏదో ఉంది. రోడ్డు క్రాస్ చేస్తూ కనిపించారామె. అందాల తార రోడ్డు మీద కనబడితే ఊరుకుంటారా? వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో చూసి, ‘లాక్‌డౌన్ టైమ్‌లో రకుల్ ఏం చేస్తోంది? ఆల్కహాల్ కొంటొందా?’ అంటూ ఎవరో ట్వీట్ చేశారు. దానికి రకుల్ చాలా కూల్‌గా ‘ఓ.. మెడికల్ షాప్‌లో మద్యం అమ్ముతారని నాకు తెలియదు’ అని సమాధానం ఇచ్చారు. అయినా రకుల్ మందు కొంటే ఏంటి? మద్యం కొంటే ఏంటి? ఎవరి ఇష్టం వాళ్లది అంటూ అభిమానులు ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment