భారత్‌లో మహిళల క్రీడా అభివృద్దికి యూఎస్‌ కృషి.. | United Mission to India Support Womens Leadership through Sports | Sakshi
Sakshi News home page

భారత్‌లో మహిళల క్రీడా అభివృద్దికి యూఎస్‌ కృషి..

Published Thu, Aug 22 2024 9:42 PM | Last Updated on Thu, Aug 22 2024 9:44 PM

United Mission to India Support Womens Leadership through Sports

క్రీడల్లో భారత మహిళల భాగస్వామ్యాన్ని, లీడ‌ర్ షిప్ స్కిల్స్ ను పెంచేందుకు  యూనైట‌డ్ స్టేట్స్ ఆఫ్‌ అమెరికా(యూఎస్ఎ) ముందడుగు వేసింది. ఈ క్ర‌మంలో యూఎస్ రాయ‌బార కార్య‌ల‌యం, కాన్సులేట్‌లు గేమ్ ఛేంజర్స్ అల్టిమేట్ ఫ్రిస్బీ అనే ప్రాజెక్ట్ ను లాంఛ్ చేశారు. 

అల్టిమేట్ ఫ్రిస్బీ  గేమ్ ద్వారా లింగ సమానత్వం, మ‌హిళ‌ల‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను పెంపొందించాల‌ని యూఎస్ ఎంబసీ భావిస్తోంది. తొలుత ఈ కార్య‌క్ర‌మం భార‌త్‌లోని ముఖ్య న‌గ‌రాలు ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, చెన్నైలలో ఆగస్టు 19 నుండి 24 వరకు జ‌ర‌గ‌నుంది. 

ఆ త‌ర్వాత  ఆగస్టు 26 నుండి 31 వరకు ముంబైలో ఈ గేమ్ ఛేంజ‌ర్స్ పోగ్రాంను నిర్వ‌హించ‌నున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి 100 మంది మ‌హిళా కోచ్‌ల‌ను తాయారు చేయ‌డ‌మే ఈ ప్రాజెక్ట్ అంతిమ ల‌క్ష్యం. 

ఈ కార్య‌క‌మాన్ని న‌గ‌రాల్లోని ప‌లు  విద్యా సంస్థలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లలో నిర్వ‌హించ‌నున్నారు. కోచ్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్‌లు, జెండ‌ర్ ఈక్విటీ క్లాస్‌ల‌తో ఈ పోగ్రాం ప్రారంభం కానుంది. ఆ త‌ర్వాత అల్టిమేట్ ఫ్రిస్బీ గేమ్‌కు సంబంధించిన సెష‌న్స్‌లో స‌ద‌రు మ‌హిళ‌లు పాల్గోనున్నారు. కాగా అల్టిమేట్ ఫ్రిస్బీ అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందిన క్రీడ. కాగా ఈ గేమ్‌లో అబ్బాయిలు, అమ్మాయిలు క‌లిసి పాల్గోన‌వ‌చ్చు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement