ఆకట్టుకున్న మహిళల కోలాట ప్రదర్శన
కొత్తూరు (తాడేపల్లి రూరల్) : అంతరించిపోతున్న కోలాట ప్రదర్శనను వెలుగులోకి తేవాలని తాడేపల్లి మహిళలు మూడు నెలల పాటు తర్ఫీదు పొంది ఆదివారం రాత్రి తాడేపల్లి పట్టణ పరిధిలోని వైఎస్సార్ సెంటర్‌లో ప్రదర్శన ఇచ్చారు. తణుకుకు చెందిన పంపన త్రిమూర్తులు అనే కోలాట గురువు తాడేపల్లికి చెందిన శ్రీ పద్మావతి కోలాట భజన మండలి పేరుతో మహిళలకు కోలాటంలో తర్ఫీదు ఇచ్చారు. మొదటిసారిగా తాడేపల్లి కొత్తూరులో కోలాటం ప్రదర్శించిన ఈ బృందం దేవుడి సన్నిధిలో ప్రదర్శనలు ఇవ్వనున్నట్టు మహిళలు తెలిపారు.