attractive
-
చైనాను బీట్ చేసి మరీ, దూసుకొచ్చిన భారత్
న్యూఢిల్లీ: పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా భారతదేశం చైనాను అధిగమించింది. దాదాపు 21 ట్రిలియన్ డాలర్ల అసెట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 85 సావరిన్ వెల్త్ ఫండ్లు, 57 సెంట్రల్ బ్యాంకులు, 142 చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ల అభిప్రాయాల ప్రాతిపదికన ప్రపంచ పెట్టుబడి నిర్వహణ సంస్థ ఇన్వెస్కో వెల్లడించిన ఒక నివేదిక ఈ విషయాన్ని తెలిపించింది. ‘‘ఇన్వెస్కో గ్లోబల్ సావరిన్ అసెట్ మేనేజ్మెంట్ స్టడీ’’ పేరుతో వెలువడిన ఈ నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ♦ భారతదేశలో మెరుగైన వ్యాపార పరిస్థితులు, రాజకీయ స్థిరత్వం, అనుకూలమైన జనాభా, నియంత్రణ పరమైన సానుకూలతలు అంతర్జాతీయ పెట్టుబడిదారులు, సంస్థలు, ఫండ్స్‌కు స్నేహపూర్వక వాతావరణం కలి్పస్తున్నాయి. ♦ ద్రవ్యోల్బణం– వాస్తవ వడ్డీ రేట్ల పరిస్థితుల ప్రాతిపదికన పెట్టుబడిదారులు తరచూ తమ పోర్ట్‌ఫోలియోలను రీకాలిబ్రేట్ (పునఃసమీక్ష, మదింపు) చేసుకుంటున్నారు. ♦ ‘‘మాకు భారతదేశం లేదా చైనాతో తగినంత పెట్టుబడులు ఏమీ లేవు. అయితే, వ్యాపార, రాజకీయ స్థిరత్వం పరంగా భారతదేశం ఇప్పుడు మెరుగైన పరిస్థితిలో ఉన్నట్లు కనబడుతోంది. రెగ్యులేటరీ వ్యవస్థల పటిష్టంగా ఉండడం సావరిన్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న అంశం’’ అని మధ్యప్రాచ్యంలో ఉన్న ఒక సావరిన్ ఫండ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ♦ దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ రెండింటినీ లక్ష్యంగా చేసుకుని పెరిగిన విదేశీ కార్పొరేట్ పెట్టుబడుల వల్ల ప్రయోజనం పొందుతున్న మెక్సికో, బ్రెజిల్‌తో సహా అనేక దేశాలలో భారతదేశం ఒకటిగా ఉంటోంది. ♦ కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య మధ్య నికర వ్యత్యాసం) కట్టడికి, దేశీయ కరెన్సీల పటిష్టతలకు దోహదపడుతున్న అంశం ఇది. ♦ పెట్టుబడులను పెంచడానికి ఆకర్షణీయమైన వర్ధమాన మార్కెట్లలో ప్రస్తుతం భారత్, దక్షిణ కొరియాలు ఉన్నాయి. ♦ ద్రవ్యోల్బణం సవాళ్లు భారత్‌సహా భౌగోళికంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పసిడి, వర్థమాన దేశాల మార్కెట్ బాండ్లు పెట్టుబడులకు తగిన సాధనాలుగా భావించవచ్చు. -
అమెజాన్‌ను మించి.. ఆకర్షణీయ ఎంప్లాయర్ బ్రాండ్ ఏంటో తెలుసా?
ముంబై: దేశీయంగా అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ (ఉద్యోగాలు కల్పించే సంస్థ) బ్రాండ్‌గా టాటా పవర్ కంపెనీ అగ్రస్థానంలో నిల్చింది. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్, ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ వరుసగా రెండు, మూడో స్థానాలు దక్కించుకున్నాయి. మానవ వనరుల సర్వీసుల సంస్థ రాండ్‌స్టాడ్ ఇండియా తమ వార్షిక నివేదిక ‘రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2023‘లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆర్థిక స్థితి, మంచి పేరు, కెరియర్లో పురోగమించేందుకు అవకాశాలు కల్పించడం వంటి మూడు అంశాల ప్రాతిపదికగా రాండ్‌స్టాడ్ ర్యాంకులు ఇచ్చింది. దీని ప్రకారం 2022లో 9వ స్థానంలో ఉన్న టాటా పవర్ తాజాగా నంబర్ వన్ స్థానానికి చేరింది. నివేదిక ప్రకారం ఉద్యోగులు అత్యంత ఆకర్షణీయమైన రంగంగా ఆటోమోటివ్‌కు (77 శాతం) ఓటేశారు. ఐటీ, ఐటీఈఎస్, టెలికం (76 శాతం) .. ఎఫ్ఎంసీజీ, రిటైల్, ఈ–కామర్స్ (75 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మరిన్ని విశేషాలు.. టాప్ 10 కంపెనీల్లో నాలుగో స్థానంలో టీసీఎస్.. ఆ తర్వాత వరుసగా మైక్రోసాఫ్ట్, శాంసంగ్ ఇండియా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఐబీఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయ స్టార్టప్ ఎంప్లాయర్‌గా బిగ్ బాస్కెట్ నిల్చింది. ఎంప్లాయర్‌ను ఎంచుకునేటప్పుడు ఉద్యోగ–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం, కంపెనీకి ఉన్న పేరు ప్రతిష్టలు, ఆకర్షణీయమైన జీతభత్యాలకు ఉద్యోగార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళలు ఎక్కువగా ఉద్యోగ–వ్యక్తిగత జీవితం మధ్య సమతూకాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. అదనపు ఆదాయం కోసం వేరే అసైన్మెంట్లు లేదా అదనంగా మరో ఉపాధి మార్గాన్ని ఎంచుకునేందుకు అనుమతించే కంపెనీలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయని 91 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. సిబ్బంది ఆధారంగానే వ్యాపారంలో విజయం సాధించగలమని, పెట్టుబడి ఒక్కటే సరిపోదని ప్రపంచవ్యాప్తంగా సంస్థలు గుర్తిస్తున్నాయి. అలాగే, ఉద్యోగులు కూడా తాము ఏ బ్రాండుతో కలిసి పని చేయాలి, దీర్ఘకాలికంగా పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం ఎలా ఉంటుంది అనే అంశాలపై మరింతగా ఆలోచిస్తున్నారు. -
టాప్ 10 ప్రపంచంలోని అత్యంత ఆకర్షించే ఇంజనీరింగ్ సైట్లు
-
లింక్డ్ఇన్ టాప్ కంపెనీలు: ఉద్యోగులకు ఆకర్షణీయ సంస్థగా విటెస్కో టెక్నాలజీస్
న్యూఢిల్లీ: పవర్ ట్రెయిన్ టెక్నాలజీస్ కంపెనీ ‘విటెస్కో టెక్నాలజీస్’ లింక్డ్ఇన్ 2023 అగ్రగామి కంపెనీల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ విషయాన్ని విటెస్కో టెక్నాలజీస్ ప్రకటించింది. భారత్‌తో పాటు, ఫ్రాన్స్, అమెరికాలోనూ ఏక కాలంలో ఉత్తమ కంపెనీగా నిలిచినట్టు తెలిపింది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 38 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. మూడు ఖండాల్లోనూ ఎక్కువ మంది ఉద్యోగులకు ఆకర్షణీయ కంపెనీగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఈ అవార్డు రావడం పట్ల గర్విస్తున్నాం. ఉద్యోగుల వృత్తిపరమైన, వ్యక్తిగత అభివృద్ధి పట్ల మా అంకిత భావానికి ఇది నిదర్శనం’’అని విటెస్కో టెక్నాలజీస్ సీహెచ్ఆర్వో ఇంగో హోల్స్టీన్ ప్రకటించారు. ఇదీ చదవండి: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. 44 వేల జాబ్ ఆఫర్లు.. అందరికీ ఉద్యోగాలు! ఉద్యోగులకు అత్యుత్తమ కెరీర్ అవకాశాలను కల్పించి ప్రోత్సహించే కంపెనీలను లింక్డ్ఇన్ గుర్తించి టాప్ కంపెనీస్ ర్యాంకింగ్ ఇస్తుంది. ఇందుకు వృత్తిపరమైన అభివృద్ధితో పాటు పని-జీవిత సమతుల్యత, అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించే, నిలుపుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇదీ చదవండి: 23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్‌లో...? -
Union Budget 2023-24: కొత్త పన్ను విధానం ఆకర్షణీయం
న్యూఢిల్లీ: నూతన పన్ను విధానం 2023–24 బడ్జెట్‌తో ఆకర్షణీయంగా మారినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు ఇది ప్రయోజనకరమని, తక్కువ పన్ను రేటును వారు ఆస్వాదిస్తారని చెప్పారు. బడ్జెట్ అనంతరం ఓ వార్తా సంస్థతో గుప్తా మాట్లాడారు. తగ్గింపులు, మినహాయింపులను క్రమంగా దూరం చేయడం కోసమే నూతన పన్ను విధానంలో (మినహాయింపుల్లేని) కొత్త శ్లాబులు, రేట్లు ప్రకటించడానికి కారణంగా పేర్కొన్నారు. దీని ద్వారా వ్యక్తులు, సంస్థలపై పన్ను రేట్లు తగ్గించాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ను చేరుకోవడం సాధ్యపడుతుందన్నారు. ‘‘నూతన పన్ను విధానాన్ని రెండేళ్ల క్రితం (2020–21 బడ్జెట్లో) ప్రతిపాదించాం. అయినప్పటికీ తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం శ్లాబులను మార్చింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు రేట్లు, శ్లాబులు ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతాయి’’అని చెప్పారు. కార్పొరేట్ విభాగంలో పన్ను చెల్లింపుదారులకు ఇదే మాదిరి చర్యలను కొంత కాలం క్రితం ప్రకటించగా, వారికి ప్రయోజనకరంగా మారినట్టు గుప్తా తెలిపారు. నూతన పన్ను విధానంతో లబ్ధి పొందని వర్గాలు చాలా తక్కువన్నారు. దీనిలో స్టాండర్డ్ డిడక్షన్ కల్పించినందున, అది పాత విధానంలోని ప్రయోజనాలకు ఏ మాత్రం తీసిపోదన్నారు. పన్ను చెల్లింపు దారుల ఇష్టమే.. నూతన పన్ను విధానం డిఫాల్ట్ (ప్రమేయం లేని)గా ఉంటున్నందున, పాత పన్ను విధానంలో ఉన్నవారిపై ప్రభావం పడుతుందా? అన్న ప్రశ్నకు.. ఏ విధానం అయినా ఎంపిక చేసుకుని రిటర్నులు దాఖలు చేసే స్వేచ్ఛ పన్ను చెల్లింపుదారులకు ఉంటుందని నితిన్‌గుప్తా చెప్పారు. కావాలంటే పాత పన్ను విధానానికి కూడా మారిపోవచ్చన్నారు. ‘‘డిఫాల్ట్ అంటే ఫైలింగ్ పోర్టల్ స్క్రీన్‌పై ముందు కనిపిస్తుంది. కానీ, అక్కడ ఏ పన్ను విధానం అనే ఆప్షన్ ఉంటుంది. కావాల్సిన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు’’అని గుప్తా వివరించారు. ఏ వర్గం పన్ను చెల్లింపుదారులను కూడా నిరుత్సాహపరచబోమన్నారు. నూతన పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు పన్ను చెల్లించే అవకాశం లేకుండా రిబేట్ కల్పించడం తెలిసిందే. దీనికి అదనంగా రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా ప్రకటించారు. పాత విధానంలో అయితే రూ.5 లక్షలకు మించిన ఆదాయంపై 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే వివిధ సెక్షన్ల కింద తగిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతిమంగా కొత్త విధానమే తక్కువ పన్ను రేట్లతో, మినహాయింపుల్లేని, సులభతర పన్నుల విధానానికి (నూతన పన్ను విధానం) మళ్లడమే ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. రెవెన్యూ శాఖ నిర్వహించిన విశ్లేషణ ప్రకారం ఏటా రూ.15 లక్షలు ఆర్జించే వ్యక్తి పాత పన్ను విధానంలో రూ.3.75 లక్షల వరకు క్లెయిమ్‌లు పొందొచ్చని.. కానీ, తక్కువ పన్ను రేట్లతో దీనికి ప్రత్యామ్నాయ పన్నుల విధానాన్ని ప్రతిపాదించినట్టు చెప్పారు. నూతన పన్ను విధానం తప్పనిసరి చేయడానికి ఎలాంటి గడువు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. -
పెట్టుబడుల రక్షణకు మూడు సూత్రాలు...రిస్క్‌లేకుండా!
గత ఏడాది కాలంగా అంతర్జాతీయంగా అనిశ్చితిపరమైన సవాళ్లు నెలకొన్నా ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే రాణిస్తోంది. దేశీ మార్కెట్లలో కరెక్షన్ కొంత స్థాయికే పరిమితమైంది. రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వం, కార్పొరేట్లు మొదలైన వర్గాలన్నీ పరిస్థితిని చక్కగానే ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాయి. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియను ఆపేవరకూ మార్కెట్లలో కుదుపులు కొన సాగుతూనే ఉంటాయి. దేశీ మార్కెట్ వేల్యుయేషన్లు ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉన్నందున మదుపరులు.. రిస్కులను గుర్తెరిగి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో పోర్ట్‌ఫోలియోను రిస్కుల నుండి కాపాడుకునేందుకు వ్యక్తిగత ఇన్వెస్టర్లు పాటించతగిన సూత్రాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే.. డెట్ ఫండ్స్‌లో మదుపు ఏడాదిన్నర, రెండేళ్లుగా పాపులారిటీని కోల్పోయిన డెట్ సాధనాలు మళ్లీ ఆకర్షణీయంగా మారుతున్నాయి. వివిధ కాలావధులకు సంబంధించి అధిక రాబడులు అందిస్తున్నాయి. అధిక ధరలు, అంతర్జాతీయ ఎకానమీకి పెను సవాళ్లు పొంచి ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లోనూ రెపో రేట్ పెంపు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ రిస్కులు ఉండే స్వల్ప, మధ్య కాలిక ఎక్రూవల్ ఫండ్స్, అలాగే డైనమిక్ వ్యవధుల స్కీములను ఎంచుకోవచ్చు. ఫ్లోటింగ్-రేట్ బాండ్లు (ఎఫ్ఆర్బీ) అన్నింటి కన్నా మెరుగ్గా రాణించగలవని అంచనాలు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోను కాపాడుకోవడంలో .. డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయని గుర్తుంచుకోవాలి. లక్ష్యాల ఆధారిత ఫండ్స్ .. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కి అందుబాటులో ఉన్న అస్త్రాలన్నీ ప్రయోగించడం పూర్తయ్యే వరకూ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్లు .. ముఖ్యంగా భారతీయ మదుపుదారులు కొంత ఆచితూచి వ్యవహరించాలి. మూడు నుంచి అయిదేళ్ల కాల వ్యవధిని నిర్దేశించుకుని రాబోయే ఏడాది కాలంలో సిప్మార్గంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం. ఇక ఈక్విటీల్లో ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయదల్చుకుంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ లేదా మల్టీ–అసెట్ కేటగిరీల్లో పెట్టుబడులు పెట్టడాన్ని పరిశీలించవచ్చు. అలాగే వివిధ ఆర్థిక లక్ష్యాలను ప్రణాళికబద్ధంగా సాధించేందుకు బూస్టర్ సిప్, బూస్టర్ ఎస్టీపీ లేదా ఫ్రీడమ్ ఎస్‌డబ్ల్యూపీ వంటి ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చు. గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు .. వివిధ సాధనాల్లో పెట్టుబడులతో పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం పాటిస్తే.. ఒక సాధనం వల్ల నష్టాలేవైనా వచ్చినా మరొక దాని ద్వారా భర్తీ చేసుకోవచ్చు. ప్రస్తుతం అనిశ్చితి నెలకొన్న తరుణంలో బంగారం, వెండి వంటి కమోడిటీలు ఆసక్తికరమైన సాధనాలుగా ఉండగలవు. ద్రవ్యోల్బణానికి మాత్రమే కాకుండా కరెన్సీ క్షీణతకు కూడా ఇవి హెడ్జింగ్ సాధనంగా పని చేయగలవు. ఈటీఎఫ్‌ల మార్గంలో వీటిలో ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించవచ్చు. డీమ్యాట్ ఖాతా లేని వారికి గోల్డ్ లేదా సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉపయోగకరంగా ఉండగలవు. -ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ ఎండీ, నిమేష్ షా -
దూరం నుంచి చూస్తే రైలు..తీరా దగ్గరకు వచ్చి చూస్తే..
సాక్షి, నవరంగపూర్( భువనేశ్వర్): కొంతమంది కళాకారులు తమ చేతి నైపుణ్యం, పనితనంతో చిత్రాలకు ప్రాణం పోస్తారంటారు. ఇలాంటి అనుభూతి కొన్ని సందర్భాల్లోనే మనకి కలుగుతుంది. ప్రస్తుతం ఓ గోడ మీద వేసిన బొమ్మను చూసి ఇలాంటి అనుభూతి కలిగిందని అంటున్నారు ఓ ప్రాంత ప్రజలు. వివరాల్లోకి వెళితే.. నవరంగపూర్ జిల్లా కలెక్టరేట్ ప్రహరీగోడపై వేసిన రైలు బొమ్మ నగరవాసులను ఇట్టే ఆకట్టుకుంది. అచ్ఛం రైలుబండి లాగానే వేసిన పెయింటింగ్ అద్భుతంగా ఉంది. ఆ బొమ్మ ఎలా ఉందంటే.. దూరం నుంచి చూసిన వారికి... నవరంగపూర్‌కు రైలు ఎప్పుడు వచ్చిందోనని ఆశ్చర్యం కలగక మానదు. తీరా దగ్గరకు వచ్చి చూడగా, అది రైలుకాదని కేవలం చిత్రమని తెలిసి చాలమంది అచ్చెరువొందారు. శుక్రవారం నగరవాసులు రైలుబొమ్మతో సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది. -
కొత్తగా.. పండగలా..
ఆకాశం నుంచి నక్షత్రాలు తెచ్చి అల్లినట్టుగా...భూమ్మీద ముగ్గులు తెచ్చి అద్దినట్టుగా...తోకాడించే గాలిపటాలనుగగనానికి పంపినట్టుగా...అంతా పండగలా.. కానీ, కొంచెం కొత్తగా!తెలుగింటి విరిబోణి కట్టు లంగా ఓణీ. సంప్రదాయ వేడుక లేదా పండగ అనగానే పట్టు లంగా ఓణీ తలపుకు వచ్చేస్తుంది. ఎప్పుడూ ఒకే టైప్ డ్రెస్ కోడ్ అనే నేటితరానికి మరికొంచెం కొత్తగా, మరింత ఆకర్షణీయంగా ఉండేలా ఇలాంటి డిజైన్ లెహంగా, దుపట్టాలను ఎంపిక చేయచ్చు. అయితే, కలర్ కాంబినేషన్స్, అలంకరణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్లెయిన్ కలర్స్ అయినా కట్, కుట్టుతో ఇలాంటి కాంబినేషన్ ఆకట్టుకుంటుంది. సంప్రదాయ రంగులు అయితే పెద్ద పెద్ద ఆభరణాలు ధరించినా అందంగా కనిపిస్తారు. అదే, స్పెషల్ అనిపించే గ్రే, లైట్ క్రీమ్, సియాన్.. వంటి రంగులకు ఆభరణాల అలంకరణ అంతగా నప్పవు. డిజైన్‌లో ఉన్న తేడాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇతర అలంకరణపై దృష్టి పెట్టాలి. ►గ్లాస్ బీడ్స్, ముత్యాలు, జర్దోసీల కలయికతో ఎంబ్రాయిడరీ చేసిన రా సిల్క్ లెహెంగా, జాకెట్టు గ్రాండ్‌గా కనువిందు చేస్తుంది. దీనికి రెడ్ కలర్ కట్‌వర్క్ నెటెడ్ దుపట్టా జత చేయడంతో చూపులను కట్టడి చేస్తుంది. ►జర్డోసీ, గ్లాస్ బీడ్స్‌తో ఎంబ్రాయిడరీ చేసిన పసుపు లెహెంగా పండగ సమయంలో ధరిస్తే చూపు తిప్పుకోనివ్వదు. లెహెంగా అంచు రంగును పోలిన నీలాకాశపు కట్ వర్క్ దుపట్టా మింట్ రా సిల్క్ డిజైనర్ బ్లౌజ్ లెహంగాకి పర్ఫెక్ట్ మ్యాచ్. ►సంప్రదాయ వేడుకలకు చిరునామాగా నిలుస్తాయి ఎరుపు, పసుపు రంగులు. ఎరుపు రంగు రా సిల్క్ మీద సీక్వెన్స్ వర్క్, జియోమెట్రికల్ ప్యాటర్న్ బ్లౌ, కట్‌వర్క్ దుపట్టా లుక్‌ని అందంగా మార్చింది. బెల్ట్ భాగం ప్రత్యేకతను నిలుపుతోంది. ►ముదురు ఎరుపు లంగా, జాకెట్టు దానికి క్రీమ్ కలర్ దుపట్టా సరైన కాంబినేషన్. అయితే ఇందుకు ఫ్యాబ్రిక్ ఎంపికలో జాగ్రత్త తీసుకోవాలి. బీజ్ టుల్ లెహెంగా మీద ఆలోవర్ సిక్వెన్ వర్క్, జియోమెట్రికల్ ప్యాటర్న్ బ్లౌజ్, కట్‌వర్క్ నెటెడ్ దుపట్టా కళను రెట్టింపు చేస్తుంది. ►లేత గులాబీని తలపించే బీజ్ టుల్ లెహెంగా, దాని మీద ఆలోవర్ సీక్వెన్ వర్క్ అబ్బురుపరుస్తుంటుంది. దీనికి లేత నీలం రంగు కట్‌వర్క్ దుపట్టా, సీక్వెన్ బ్లౌజ్ ఆకర్షణీయంగా రూపుకట్టింది. ►రా సిల్క్ లెహెంగా, మీద గ్లాస్ బీడ్స్, జరీ వర్క్ చేయడంతో ట్రెండీ లుక్ తీసుకువచ్చింది. లెహెంగా రంగులోనే డిజైనర్ బ్లౌజ్, క్రీమ్ కలర్ నెటెడ్ కట్‌వర్క్ దుపట్టా జతచేయడంతో అందానికి అంబరమే హద్దుగా మారింది. ఫాయిల్ప్రింటెడ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లెహెంగా ఇది. దీనికిజర్దోసీ వర్క్ చేసిన బ్లౌజ్‌ని జత చేయడంతో యంగ్ లుక్‌ని మరింత ఆకర్షణీయంగా మార్చేసింది. ఇదే రంగు సీక్వెన్ కట్ వర్క్ దుపట్టాతో లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది. -
ఆకట్టుకున్న మహిళల కోలాట ప్రదర్శన
కొత్తూరు (తాడేపల్లి రూరల్) : అంతరించిపోతున్న కోలాట ప్రదర్శనను వెలుగులోకి తేవాలని తాడేపల్లి మహిళలు మూడు నెలల పాటు తర్ఫీదు పొంది ఆదివారం రాత్రి తాడేపల్లి పట్టణ పరిధిలోని వైఎస్సార్ సెంటర్లో ప్రదర్శన ఇచ్చారు. తణుకుకు చెందిన పంపన త్రిమూర్తులు అనే కోలాట గురువు తాడేపల్లికి చెందిన శ్రీ పద్మావతి కోలాట భజన మండలి పేరుతో మహిళలకు కోలాటంలో తర్ఫీదు ఇచ్చారు. మొదటిసారిగా తాడేపల్లి కొత్తూరులో కోలాటం ప్రదర్శించిన ఈ బృందం దేవుడి సన్నిధిలో ప్రదర్శనలు ఇవ్వనున్నట్టు మహిళలు తెలిపారు. -
ఐస్ శివలింగ ఆకర్షణ
చిగురుపాడు (అచ్చంపేట) : అచ్చంపేట మండలంలోని చిగురుపాడులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద 2 క్వింటాళ్ల ఐస్ గడ్డతో రూపొందించిన శివలింగం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ గణపతి నవరాత్రి ముగింపు ఉత్సవాలు గురువారం రాత్రి గణేష్ యూత్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. స్వామివారికి రెండున్నర క్వింటాళ్ల బంతి పూలతో గజమాల వేశారు. ఈ అందమైన దశ్యాలను తిలకించేందుకు పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. యూత్ సభ్యులు కందుకూరి ఏడుకొండలు, పోలిశెట్టి చెంచయ్య, నాగేశ్వరరావు, నరసింహారావు, ఆంజనేయులు, కిలారి బజారు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
ఐస్ శివలింగ ఆకర్షణ
చిగురుపాడు (అచ్చంపేట) : అచ్చంపేట మండలంలోని చిగురుపాడులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద 2 క్వింటాళ్ల ఐస్ గడ్డతో రూపొందించిన శివలింగం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ గణపతి నవరాత్రి ముగింపు ఉత్సవాలు గురువారం రాత్రి గణేష్ యూత్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. స్వామివారికి రెండున్నర క్వింటాళ్ల బంతి పూలతో గజమాల వేశారు. ఈ అందమైన దశ్యాలను తిలకించేందుకు పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. యూత్ సభ్యులు కందుకూరి ఏడుకొండలు, పోలిశెట్టి చెంచయ్య, నాగేశ్వరరావు, నరసింహారావు, ఆంజనేయులు, కిలారి బజారు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
ఆకట్టుకున్న కళా ఉత్సవాలు
గద్వాల : ప్రతిఒక్కరూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని జిల్లా ఉప విద్యాధికారి నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బాలభవన్‌లో నిర్వహించిన డివిజన్‌స్థాయి కళా ఉత్సవాల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని పలు రంగాల్లో నైపుణ్యం చాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రతి కళాకారుడు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. డివిజన్ స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఇందులో జానపద నృత్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల శిరీష బృందం, గిరిజన నృత్యంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల అర్చన బృందం విద్యార్థులు సత్తా చాటారు. దేశభక్తి నృత్యంలో అమరచింతకు చెందిన చంద్రిక విద్యార్థులు, శాస్త్రీయ సంగీతంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల రఘువర్ధన్ గెలుపొందారు. నాటకంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు శివ, దీప్తిల బృందం, డ్రాయింగ్‌లో బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి రోహన్ ప్రతిభచాటాడు. వీరు శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని బాలభవన్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో బాలభవన్ గౌరవాధ్యక్షుడు రాజగోపాలాచారి, మురళీకృష్ణ, రామిరెడ్డి, కన్నమ్మ, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
సిటీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి
మద్దిలపాలెం : విశాఖ నగరాన్ని మరింత సుందరీకరించాలని, ఆకర్షణీయ నగరం తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. జీవీఎంసీ కమిషనర్ హరినారాయణతో కలసి శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఇందులో భాగంగా మద్దిలపాలెం జంక్షన్లో పర్యటించిన కలెక్టర్ తెలుగుతల్లి విగ్రహం వద్ద ఐలాండ్‌ను సుందరీకరించాలన్నారు. అదేవిధంగా జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న గ్రీన్బెల్టులొ పిచ్చిమొక్కలను తొలగించి, ఆధునీకరించాలని, ట్రాఫిక్ ఐలాండ్లు ఎక్కడక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా వర్షాకాలాన్ని దష్టిలో ఉంచుకుని కొండవాలు ప్రాంతాలలో రిటైనింగ్‌వాల్ నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సుందరీకరణకు చేపడుతున్న వివరాలను కలెక్టర్,ప్రత్యేక అధికారి ప్రవీణ్‌కుమార్‌కు, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్ తెలిపారు. పర్యటనలో ఇన్చార్జ్ చీఫ్ ఇంజినీర్ డాక్టర్ వి.చంద్రయ్య, ఏడీహెచ్ దామోదర్, కార్యనిర్వాహక ఇంజినీర్ సుధాకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
ఆహ్లాదాన్ని పంచుతున్న గుల్మోహర్ పుష్పాలు
జహీరాబాద్: సువాసన వెదజల్లే గుణం లేకపోయిన అందాన్ని చూపించే గుణం ఉన్న గుల్మోహర్ పుష్పాలు అందరి ఆకట్టుకుంటున్నాయి. అల్లాదుర్గం-మెటల్‌కుంట రోడ్డు కు ఇరువైపుల హద్నూర్, న్యాల్కల్లోని ఆర్టీసీ బస్టాండ్, జడ్పీహెచ్ఎస్ పాఠశాల, ముంగి గ్రామాల శివారులో గల గుల్మోహర్ చెట్లకు కాసిన ఎర్రని పుష్పాలు రోడ్డుపై వచ్చి పోయేవారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. (న్యాల్కల్)