న్యూఢిల్లీ: పవర్ ట్రెయిన్ టెక్నాలజీస్ కంపెనీ ‘విటెస్కో టెక్నాలజీస్’ లింక్డ్‌ఇన్ 2023 అగ్రగామి కంపెనీల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ విషయాన్ని విటెస్కో టెక్నాలజీస్ ప్రకటించింది. భారత్‌తో పాటు, ఫ్రాన్స్, అమెరికాలోనూ ఏక కాలంలో ఉత్తమ కంపెనీగా నిలిచినట్టు తెలిపింది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 38 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. మూడు ఖండాల్లోనూ ఎక్కువ మంది ఉద్యోగులకు ఆకర్షణీయ కంపెనీగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఈ అవార్డు రావడం పట్ల గర్విస్తున్నాం. ఉద్యోగుల వృత్తిపరమైన, వ్యక్తిగత అభివృద్ధి పట్ల మా అంకిత భావానికి ఇది నిదర్శనం’’అని విటెస్కో టెక్నాలజీస్ సీహెచ్‌ఆర్‌వో ఇంగో హోల్‌స్టీన్ ప్రకటించారు.
ఇదీ చదవండి: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. 44 వేల జాబ్ ఆఫర్లు.. అందరికీ ఉద్యోగాలు!
ఉద్యోగులకు అత్యుత్తమ కెరీర్ అవకాశాలను కల్పించి ప్రోత్సహించే కంపెనీలను లింక్డ్‌ఇన్ గుర్తించి టాప్ కంపెనీస్ ర్యాంకింగ్ ఇస్తుంది. ఇందుకు వృత్తిపరమైన అభివృద్ధితో పాటు పని-జీవిత సమతుల్యత, అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించే, నిలుపుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.
ఇదీ చదవండి: 23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్‌లో...?
Comments
Please login to add a commentAdd a comment