సిటీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి
మద్దిలపాలెం : విశాఖ నగరాన్ని మరింత సుందరీకరించాలని, ఆకర్షణీయ నగరం తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. జీవీఎంసీ కమిషనర్ హరినారాయణతో కలసి శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఇందులో భాగంగా మద్దిలపాలెం జంక్షన్‌లో పర్యటించిన కలెక్టర్ తెలుగుతల్లి విగ్రహం వద్ద ఐలాండ్‌ను సుందరీకరించాలన్నారు. అదేవిధంగా జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న గ్రీన్‌బెల్టులొ పిచ్చిమొక్కలను తొలగించి, ఆధునీకరించాలని, ట్రాఫిక్ ఐలాండ్‌లు ఎక్కడక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా వర్షాకాలాన్ని దష్టిలో ఉంచుకుని కొండవాలు ప్రాంతాలలో రిటైనింగ్‌వాల్ నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సుందరీకరణకు చేపడుతున్న వివరాలను కలెక్టర్,ప్రత్యేక అధికారి ప్రవీణ్‌కుమార్‌కు, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్ తెలిపారు. పర్యటనలో ఇన్‌చార్జ్ చీఫ్ ఇంజినీర్ డాక్టర్ వి.చంద్రయ్య, ఏడీహెచ్ దామోదర్, కార్యనిర్వాహక ఇంజినీర్ సుధాకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.