రేపటి నుంచి ఖేలో ఇండియా పోటీలు
Published Fri, Nov 18 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM
– జిల్లా క్రీడల అభివృద్ధి ఇన్‌చార్జ్ అ«ధికారి మల్లి ఖార్జున
కర్నూలు (టౌన్): జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలలో ఖేలో ఇండియా పేరుతో క్రీడల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి ఇన్‌చార్జ్ మల్లిఖార్జున వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2008 లో పంచాయతీ యువక్రీడ ఖేల్ అభియాన్, తర్వాత రాజీవ్ ఖేల్ అభియాన్ పేర్లతో కేంద్ర ప్రభుత్వం క్రీడాపోటీలు నిర్వహించిందన్నారు. ఇప్పుడు ఖేలో ఇండియా పేరుతో క్రీడాపోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలు 14, 17 ఏళ్ల వయస్సు ఉన్న క్రీడాకారులకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత పోటీల్లో అథ్లెటిక్స్, ఆర్చరీ, తైక్వాండో, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, టీమ్‌లుగా ఫుట్‌బాల్, కబడ్డీ, కోకో, వాలీబాల్, హాకీ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నియోజక వర్గ స్థాయిలో ఈనెల 19 నుంచి 23 వరకు, జిల్లా స్థాయిల్లో ఈనెల 28 నుంచి పోటీలు ప్రారంభమవుతాయన్నారు. 29 న కబడ్డీ (బాలురు), 30 న కబడ్డీ (బాలికలు), డిసెంబర్ 1 న ఖోఖో (బాలురు), 2 వ తేదీ ఖోఖో (బాలికలు), 3 వ తేదీ ఫుట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్, 5 వ తేదీ ఆర్చరీ, హాకీ, బాక్సింగ్, రాష్ట్రస్థాయి పోటీలు 12 నుంచి14 వ తేదీ వరకు విజయవాడలోని మైలారం మైదానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయి క్రీడాపోటీలు నేటితో ముగియనున్నాయి. కాగా క్రీడల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం మండల స్థాయికి రూ. 30 వేలు, నియోజకవర్గ స్థాయికి రూ. 40 వేలు మంజూరు చేసిందని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement