అట్టహాసంగా బాలికల క్రీడా పోటీలు ప్రారంభం
14 పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 60 మంది క్రీడాకారుణులు హాజరు
కర్నూలు(టౌన్): ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల జిల్లా స్థాయి బాలికల క్రీడా పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బి. తాండ్రపాడులోని పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలను ఆ కళాశాల ప్రిన్సిపాల్ విజయభాస్కర్ క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. తరా్వత జిల్లాలోని వివిధ పాలిటెక్నిక్ కâ¶ళాశాలల నుంచి వచ్చిన క్రీడాకారుణులతో మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 14 కళాశాలల నుంచి 60 మంది క్రీడాకారుణులు పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి ప్రిని్సపాల్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యతు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు డాక్టర్ ప్రసాద్, ఫిజికల్ డైరక్టర్ మార్గరెట్ పాల్గొన్నారు.
మొదటి రోజు విజేతల వివరాలు:
మొదటి రోజు మంగళవారం నిర్వహించిన వాలీబాల్, ఖోఖో పోటీల్లో నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విన్నర్, కర్నూలు పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రన్నర్ స్థానాల్లో నిలిచాయి. టెన్నికాయిట్ సింగిల్స్, షటిల్ సింగిల్స్‌లో కర్నూలు పాలిటెక్నిక్ కళాశాల ఫైనల్‌కు చేరుకుంది.