
సాక్షి, విశాఖపట్నం : ఏపీ రాజధానికి సంబంధించి పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమంటూ కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారంటూ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. కేంద్రానికి అర్థమైన విషయం రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబుకు అర్థం కాకపోవడం విడ్డూరంగా ఉందంటూ విమర్శించారు. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం క్యాపిటలిస్టు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని, రాజధాని చుట్టూ ఉన్న రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.
మూడు ప్రాంతాల్లో రాజధానులు అనే అంశం రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతున్న బాబు మాటలు ఎవరు నమ్మొద్దని, అతని ఉచ్చులో రైతులెవరు పడొద్దని అమర్‌నాథ్ విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్న విషయం నగ్నసత్యమని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారని అప్పట్లో ప్రజలు బాబుకు అధికారమిస్తే రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేసి మరింత నీచ స్థితికి దిగజార్చారని అమర్‌నాథ్ మండిపడ్డారు.
(సభలో కాకుండా ఈనాడు, ఏబీఎన్‌లో చర్చించాలా?)
Comments
Please login to add a commentAdd a comment