దీక్షలో పాల్గొన్న బహుజన పరిరక్షణ సమితి నాయకులు
తాడికొండ: గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట అమరావతిలో జరిగిన మోసాలపై సుప్రీం కోర్టు దృష్టి సారించాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు కోరారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 112వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు మాట్లాడారు.
రాజధాని పేరిట 29 గ్రామాల్లో అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకుని అక్రమ రిజిస్ట్రేషన్లతో పూలింగ్‌కు ఇచ్చి భారీగా లబ్ధి పొందారని, భూ సమీకరణలో దళితులు పూలింగ్‌కు ఇస్తే ఒక ప్యాకేజీ ఇచ్చి, రైతుల పేరిట బాబు బినామీలు పూలింగ్‌కు ఇస్తే మరో ప్యాకేజీ ఇవ్వడం వంటి చర్యలతో దళితులపై వివక్ష చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయనకు మద్దతిస్తున్న ప్యాకేజీ పార్టీల నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment