
శుక్రవారం రిలే దీక్షల్లో పాల్గొన్న బహుజన పరిరక్షణ సమితి నాయకులు
తాడికొండ: బహుజనులను మోసం చేసిన చంద్రబాబుకు వారి ఉసురు తగిలి జైలుకెళ్లడం ఖాయమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 171వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు నాయకులు ప్రసంగించారు. దళితులు తమ సమస్యలపై ఎమ్మెల్యే ఆర్కేకు విన్నవిస్తే..ఎంపీ రఘురామకృష్ణరాజు దళితుల సమస్యలు దళితులతోనే మాట్లాడుకోవాలంటూ దుర్మార్గపు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.
కుల ముసుగులో నటుడు శివాజీ, లగడపాటి, రాధాకృష్ణ, రామోజీ, ప్యాకేజీ నాయకులు పవన్, రామకృష్ణ చెప్పే మాటలు విని రైతులు ఇప్పటికే మోసపోయారని ధ్వజమెత్తారు. ఇంకా అదే పంథాలో వెళితే 29 గ్రామాల్లో ఉన్న రైతులు వారిని తరిమికొట్టడం ఖాయమన్నారు. కాగా, తమిళనాడుకు చెందిన పలు దళిత సంఘాల నాయకులు ఈ దీక్షల్లో పాల్గొని నిరసన తెలియజేశారు. బహుజన పరిరక్షణ సమితి నాయకులు పెరికే వరప్రసాద్, మాదిగాని గురునాథం, నత్తా యోనారాజు, తమిళనాడు రాష్ట్ర దళిత నాయకులు రంభ వనకం మురుగన్, గంజడా శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment