సాక్షి, హైదరాబాద్: ఎస్సీ యువత ఉపాధికి బాటలు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ భవనాలను నిర్మిస్తోంది. ఇందులో స్టడీ సర్కిల్ తో పాటు కెరీర్‌గైడెన్స్ కార్యక్రమా లను చేపట్టనుంది. అంబేడ్కర్ భవనాల నిర్మాణానికి సంబంధిం చి సోమవారం తుది డిజైన్లు ఖరారయ్యాయి. ఒక్కో భవనాన్ని రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో స్టడీ సర్కిల్‌తో పాటు కేరీర్ గైడెన్స్ సెంటర్, వెయ్యి మంది పట్టే సామర్థ్య మున్న ఆడిటోరియం ఉంటుంది. తొలి విడతగా ఆరు జిల్లాల్లో ఈ భవనాలు నిర్మించనున్నారు.
డివిజన్, మండల కేంద్రాల్లోనూ..
జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే అంబేడ్కర్ భవన్‌లతో పాటు రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో రూ.50 లక్షలు, మండల స్థాయిలో రూ.25 లక్షలు ఖర్చు చేయనుంది. వీటి నిర్మా ణానికి స్థలాలను గుర్తించాలని ఎస్సీ అభివృద్ధి శాఖను ఆదేశిం చింది. డివిజన్, మండల స్థాయి కార్యక్రమాలకు వేదికగా వినియోగించుకునేలా నిర్మాణా లు చేపట్టాలని సూచించింది. గ్రామ స్థాయి అంబేడ్కర్ భవనాలకు రూ.7లక్షలు ఖర్చు చేయాలని ఆ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేసింది. ఈ క్రమంలోనే మంత్రి జగదీశ్‌రెడ్డి సోమవారం సచివాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా కేంద్రాల్లో నిర్మిం చే భవనాలకు ఏకకాలంలో త్వరగా టెండర్లు పిలవాలని.. నిర్మాణాలు ఒకేసారి పూర్తి చేయాలని ఆదేశించారు.
అంబేడ్కర్ భవన్‌ల తుది డిజైన్లు
Published Tue, Dec 5 2017 2:38 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment