
సాక్షి, అమరావతి: షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి పథకం అమలుకు సంబంధించి కేంద్రం ప్రకటించిన అవార్డులకు ఆంధ్రప్రదేశ్‌లోని రెండు జిల్లాలు ఎంపికయ్యాయి. ఈ పథకం అమలులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మూడు జిల్లాలకు ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన (పీఎంఏజీవై) అవార్డులను అందిస్తున్నారు. దేశంలోని మూడు జిల్లాలను ఈ అవార్డుల కోసం ఎంపిక చేయగా.. అందులో రెండు జిల్లాలు రాష్ట్రానివే కావడం విశేషం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రెండో స్థానం, తూర్పు గోదావరి జిల్లా మూడో స్థానం దక్కించుకున్నాయి.
చదవండి: Gold News: బంగారం కొనుగోళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త పద్దతిలో
Comments
Please login to add a commentAdd a comment