Nigeria Bus Truck Road Accident: 12 Passengers Killed In This Tragedy - Sakshi
Sakshi News home page

Nigeria Road Accident: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

Published Sun, Mar 13 2022 10:17 AM | Last Updated on Sun, Mar 13 2022 11:18 AM

Nigeria Bus Truck Collision Several People Deceased - Sakshi

నైజీరియా: దక్షిణ నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్థరాత్రి ఓటే టౌన్‌లో బస్సు-ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించారని, వాహనాల అతివేగం కారణంగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement