కనో: నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడు చోటుచేకున్నాయి. మూడుచోట్ల జరిగిన ఈ దాడుల్లో 18 మంది మృతి చెందగా, 19 మంది తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల్లో వెల్లడించింది. ఈ ఘటనలు శనివారం చోటు చేసుకున్నట్లు ఎమెర్జెన్సీ సర్వీస్ అధికారులు తెలిపారు.
ఈశాన్య నైజీరియాలోని గ్వోజా పట్టణంలో ఓ వివాహ వేడుకలో గుర్తు తెలియని మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. అదే పట్టణంలో మరో మహిళ ఓ ఆస్పత్రిలో ఆత్మాహుతి దాడి చేసింది. వివాహ వేడుకలో మృతిచెందిన వారి అంత్యక్రియల కార్యక్రమంలో మరో దాడి చోటుచేసుకుంది. ఈ మూడు ఆత్మాహుతి దాడుల్లో ఇప్పటివరకు 18 మంది మృతి చెందగా.. 42 మంది గాయపడినట్లు బోర్నో రాష్ట్ర ఎమెర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. మృతి చెందిన 18 మందిలో చిన్నారులు, మహిళలు, గర్భిణీ స్త్రీలు ఉన్నట్లు అధికారులు తెలపారు.
2014లో ఉత్తర బోర్నో ప్రాంతంలో ఉన్న గ్వోజా పట్టణాన్ని బోకో హరామ్ తీవ్రవాదులు స్వాధీనం చేసుకుంది. కెనడీయన్ ఆర్మీ సాయంతో నైజీరియన్ సైన్యం.. ఆ పట్టణాన్ని తిరిగి 2015లో స్వాధీనం చేసుకుంది. అయితే అప్పటి నుంచి పట్టణానికి సమీపంలోని కొండల నుంచి హరామ్ మిలిటెంట్లు దాడులకు తెగబడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment