
న్యూఢిల్లీ: వాహన రుణ రంగంలో ఉన్న నైజీరియా స్టార్టప్ మూవ్ తాజాగా భారత విపణిలోకి ప్రవేశించింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరులో కార్యకలాపాలను ప్రారంభించినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. మొబిలిటీ ఎంటర్‌ప్రైసెస్‌కు రెవెన్యూ ఆధారిత రుణాన్ని కంపెనీ అందిస్తోంది. యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికాలో ఉబర్‌కు వాహనాల సరఫరా భాగస్వామిగా ఉంది.
ఉబర్ డ్రైవర్ పార్ట్‌నర్లకు ప్రత్యేకంగా రుణం సమకూరుస్తోంది. రుణం అందిస్తున్న వాహనాల్లో 60 శాతం హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ మోడళ్లు ఉండాలన్నది కంపెనీ లక్ష్యం. 13 దేశాల్లో కార్యకలాపాలను మూవ్ సాగిస్తోంది. డ్రైవర్ పార్ట్‌నర్లు 50 లక్షల ట్రిప్‌లను పూర్తి చేశారని కంపెనీ తెలిపింది. సంస్థ ఇప్పటి వరకు రూ.1,600 కోట్లు సమీకరించింది.
చదవండి: Karur Vysya Bank: అదరగొట్టిన కరూర్ వైశ్యా.. డబులైంది!