Auto finance
-
భారత్‌లో నైజీరియా స్టార్టప్ ఎంట్రీ.. ఆ మూడు నగరాలే టార్గెట్!
న్యూఢిల్లీ: వాహన రుణ రంగంలో ఉన్న నైజీరియా స్టార్టప్ మూవ్ తాజాగా భారత విపణిలోకి ప్రవేశించింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరులో కార్యకలాపాలను ప్రారంభించినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. మొబిలిటీ ఎంటర్ప్రైసెస్కు రెవెన్యూ ఆధారిత రుణాన్ని కంపెనీ అందిస్తోంది. యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికాలో ఉబర్‌కు వాహనాల సరఫరా భాగస్వామిగా ఉంది. ఉబర్ డ్రైవర్ పార్ట్నర్లకు ప్రత్యేకంగా రుణం సమకూరుస్తోంది. రుణం అందిస్తున్న వాహనాల్లో 60 శాతం హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ మోడళ్లు ఉండాలన్నది కంపెనీ లక్ష్యం. 13 దేశాల్లో కార్యకలాపాలను మూవ్ సాగిస్తోంది. డ్రైవర్ పార్ట్నర్లు 50 లక్షల ట్రిప్‌లను పూర్తి చేశారని కంపెనీ తెలిపింది. సంస్థ ఇప్పటి వరకు రూ.1,600 కోట్లు సమీకరించింది. చదవండి: Karur Vysya Bank: అదరగొట్టిన కరూర్ వైశ్యా.. డబులైంది! -
ఆటో ఫైనాన్స్ కట్టలేక ఆత్మహత్య!
సాక్షి, నల్గొండ: కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ఓ ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన గడ్డం శ్రీకాంత్ (22) అనే యువకుడు నిన్న సాయంత్రం పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఇటీవల ఫైనాన్స్ లో ఆటో కొనుక్కుని శ్రీకాంత్ జీవనం సాగిస్తున్నాడు. అయితే, కరోనా లాక్డౌన్ కారణంగా ఆటో నడపకపోవడంతో ఫైనాన్స్ చెల్లింపులు పేరుకుపోయాయి. ఫైనాన్స్ నిర్వాహకులు బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో అఘాయిత్యానికి పూనుకున్నాడు. సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకుని పురుగుల మందు తాగి మరణించాడు. ఈ విషయంపై తల్లిదండ్రులు గడ్డం రాములు, వెంకటమ్మ స్థానిక పోలిస్ స్టేషన్లో ఫైనాన్స్ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. -
విశాఖలో ఉడా గ్రౌండ్స్‌లో సాక్షి మెగా ఆటో షో
-
నేటి నుంచి ‘సాక్షి–విదర్భ’ ఆటో షో
కాకినాడ: ‘సాక్షి’ దినపత్రిక, పద్మపూజిత–విదర్భ ఆటో ఫైనాన్స్ సంయుక్తంగా మూడు రోజులపాటు కాకినాడలో ఆటోషో నిర్వహించనున్నాయి. జిల్లా కేంద్రం కాకినాడ సినిమారోడ్డులోని ఆనందభారతి గ్రౌండ్స్‌లో ఈ నెల 14 వరకు మూడు రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుంది. కొత్త, పాత వాహనాల కొనుగోలు, అమ్మకాలతోపాటు తక్షణ ఫైనాన్స్ సదుపాయాన్ని కల్పించనున్నారు. ప్రప్రథమంగా కాకినాడలో జరిగే ఈ ఆటో షోలో హీరో, హోండా, బజాజ్, యమహా, టీవీఎస్, సుజికి, వెస్పా తదితర ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాలకు సంబంధించి అమ్మకాలు, కొనుగోళ్లు నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆటోషో జరుగుతుందని నిర్వాహకులు జి.రమేష్, కె.విఠల్‌కుమార్, పి.రాము చెప్పారు. ఆయా కంపెనీలకు చెందిన మార్కెట్లో కొత్తగా వచ్చిన బైక్‌లు, స్కూటర్లు ఇక్కడ అందుబాటులో ఉంచుతామన్నారు. మహిళా సందర్శకులకు ఉచితంగా మెహందీని చేతికి పెడతామని, తమ కస్టమర్లకు ఉచితంగా ఇంజిన్ ఆయిల్ మార్పు చేస్తామని, ఉచితంగా పొల్యూషన్‌ను చెక్‌చేస్తామని చెప్పారు. అవగాహన కార్యక్రమం ఈ ఆటోషోలో విదర్భ ఆటో ఫైనాన్స్, పద్మపూజిత ఆటో ఫైనాన్స్ ద్వారా వినియోగదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇక్కడ కేవలం 30 నిమిషాలలో వాహనాలకు 70 శాతం మేరకు ఫైనాన్స్ అందించనున్నారు. రూ.50 వేల నుంచి రూ.3 లక్షల విలువైన వాహనాలకు ఫైనాన్స్ చేస్తామని చెప్పారు. బహుమతుల పంట మూడు రోజులపాటు జరిగే ఆటోషోలో వినియోగదారులకు పలు బహుమతులు అందజేస్తామన్నారు. ప్రతి వాహనం కొనుగోలుపై ఒక స్క్రాచ్‌కార్డు అందజేస్తామని, ఈ కార్డు ద్వారా రూ.వెయ్యి నుంచి రూ.4 వేల వరకు తక్షణ నగదు అందజేస్తామన్నారు. బంపర్‌డ్రా ద్వారా కూడా కూడా నగదు బహుమతులు ఇస్తామన్నారు. -
అప్పుపుట్టక ఆగిన ఆటో డ్రైవర్ గుండె
పాపన్నపేట : పేదరికమే ఆ యువకుడికి శాపమైంది. ఆటో ఫైనాన్స్ వాయిదా కట్టాల్సిన సమయం దగ్గరపడడంతో నాలు గు రోజులుగా కానవచ్చిన కడపనల్లా తొక్కుతూ.. అవకాశం ఉన్న ప్రతిచోటా అప్పు కోసం యత్నించాడు. కానీ ఎ క్కడా చిల్లిగవ్వ కూడా పుట్టలేదు. దీంతో జీవనాధారమైన ఆటో లాక్కుపోతే బతి కేదెట్లా అంటూ తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. శుక్రవారం రాత్రి తీవ్ర గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని నాగ్సాన్పల్లికి చెందిన మ్యాదరి మల్లేశం (24) నిరుపేద కుటుంబంలో జన్మించా డు. చిన్నప్పుడే తల్లి ఈశ్వరమ్మ చనిపో గా మాటలు రాని అక్క శోభ, తండ్రి కిష్టయ్యల పోషణభారం మల్లేశంపైనే పడింది. గుంట భూమిలేని మల్లేశం అప్పులు చేసి ఆటో కొనుగోలు చేసి బతుకు బండి లాగుతున్నాడు. అయితే ఆటో కంతు కట్టుకుంటే ఎక్కడ లాక్కెళ్తారేమోనన్న ఆందోళన గరవుతుండగా గుండెపోటుకు గురై శుక్రవారం రాత్రి మృతి చెందాడు. అసలే పుట్టెడు దుఃఖం లో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబానికి చేతిలో చిల్లిగవ్వలేక ఆందోళనకు లోనైంది. దీంతో మేమున్నామంటూ గ్రామంలోని కుల, యువజన సంఘా లు, ప్రజాప్రతినిధులు ఏకమై చం దా లు వేసి మల్లేశం అంత్యక్రియలు నిర్వహించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మృతుడికి భార్య మంగ మ్మ, కుమార్తెలు శ్రీజ, శ్రీవనితలు ఉన్నారు. ప్రస్తుతం మంగమ్మ నిండు చూలాలు. గ్రామస్తుల అండ ఊరందరికీ తలలో నాలుక లా బతికిన మల్లేశం మృతి గ్రామస్తులందరినీ కదిలించింది. ఇద్దరు ఆడపిల్లలు తండ్రి కోసం తల్లడిల్లిపోతుంటే, భర్తను కోల్పో యి నిండు చూలాలిగా మిగిలి గుండె పగిలేలా రోదిస్తున్న మంగమ్మ చూసి ఊరువాడ ఏకమైంది. తలో చేయి వేసి రూ.70 వేలు పోగుచేసి మల్లేశం కుటుం బానికి అందజేశారు. వీటితోనే శనివా రం అంత్యక్రియలు నిర్వహించారు. ప్ర భుత్వం మల్లేశం కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ ఇందిర విజ్ఞప్తి చేశా రు. కాగా మల్లేశం మృతి పట్ల ఆటో డ్రై వర్లు సంతాపం తెలుపుతూ శనివారం వాహనాలు నడపడం బంద్ చేశారు.