మిలిటరీ యూనిట్‌పై దాడి.. 40 మంది మృతి! | attack on Chad military base presidency says | Sakshi
Sakshi News home page

మిలిటరీ యూనిట్‌పై దాడి.. 40 మంది మృతి!

Published Mon, Oct 28 2024 7:07 PM | Last Updated on Mon, Oct 28 2024 7:15 PM

 చాద్‌ అధ్యక్షుడు మహమత్ ఇద్రిస్ డెబి ఇట్నో( ఫైల్‌ ఫొటో)

చాద్‌ అధ్యక్షుడు మహమత్ ఇద్రిస్ డెబి ఇట్నో( ఫైల్‌ ఫొటో)

అబుజా: మధ్య ఆఫ్రికా దేశమైన చాద్‌లో మిలిటరీ యూనిట్‌పై జిహాదిస్ట్ గ్రూప్ బోకో హరామ్ దాడి చేసింది. ఈ దాడిలో 40 మంది సైనికులు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది.

‘‘నైజీరియా సరిహద్దుకు సమీపంలో ఉన్న చాద్ లేక్ ప్రాంతంలోని సైనిక స్థావరాన్ని ఉగ్ర సంస్థ లక్ష్యంగా చేసుకుంది.  ఆదివారం అర్థరాత్రి బోకో హరామ్ గ్రూప్‌ సభ్యులు 200 మందికి పైగా సైనికులు ఉన్న యూనిట్‌ లక్ష్యంగా దాడి చేశారు. ఈ దాడిలో 40 మంది మరణించారు. సోమవారం తెల్లవారుజామున ఘటనాస్థలిని సందర్శించా. ఈ దాడికి పాల్పడిన వారి రహస్య స్థావరాలను గాలించేందుకు ఆపరేషన్ ప్రారంభించాం’’ అని చాద్‌ అధ్యక్షుడు మహమత్ ఇద్రిస్ డెబి ఇట్నో ఓ ప్రకటన విడుదల చేశారు.

 

పూర్తిస్థాయి ఇస్లామిక్ రాజ్య స్థాపనే థ్యేయమని చెప్పుకుంటూ  2009లో ఈశాన్య నైజీరియాలో బోకో హరామ్ తీవ్రవాద సంస్థ ప్రారంభమైంది. ఈ గ్రూప్‌.. పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాను తన కీలక స్థావరంగా చేసుకుంది. ఇప్పటివరకు వేలాదిమంది అమాయకులను కర్కశంగా హతమార్చింది బొకోహరాం తీవ్రవాద సంస్థ. కొన్ని లెక్కల ప్రకారం.. ఈ గ్రూప్‌ మూడున్నర లక్షల మందిని పొట్టనబెట్టుకున్నట్లు తెలుస్తోందది. వీరి దాడులకు లక్షలాది మంది పౌరులు తమ ఇళ్లను విడిచిపెట్టి వలసవెళ్లటం గమనార్హం. 

చదవండి: ప్రచారంలో ట్రంప్‌ జోష్‌.. భార్యతో కలిసి డ్యాన్సులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement