chad lake
-
మిలిటరీ యూనిట్‌పై దాడి.. 40 మంది మృతి!
అబుజా: మధ్య ఆఫ్రికా దేశమైన చాద్‌లో మిలిటరీ యూనిట్‌పై జిహాదిస్ట్ గ్రూప్ బోకో హరామ్ దాడి చేసింది. ఈ దాడిలో 40 మంది సైనికులు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది.‘‘నైజీరియా సరిహద్దుకు సమీపంలో ఉన్న చాద్ లేక్ ప్రాంతంలోని సైనిక స్థావరాన్ని ఉగ్ర సంస్థ లక్ష్యంగా చేసుకుంది. ఆదివారం అర్థరాత్రి బోకో హరామ్ గ్రూప్ సభ్యులు 200 మందికి పైగా సైనికులు ఉన్న యూనిట్ లక్ష్యంగా దాడి చేశారు. ఈ దాడిలో 40 మంది మరణించారు. సోమవారం తెల్లవారుజామున ఘటనాస్థలిని సందర్శించా. ఈ దాడికి పాల్పడిన వారి రహస్య స్థావరాలను గాలించేందుకు ఆపరేషన్ ప్రారంభించాం’’ అని చాద్ అధ్యక్షుడు మహమత్ ఇద్రిస్ డెబి ఇట్నో ఓ ప్రకటన విడుదల చేశారు.🇹🇩|#Chad: An attack yesterday on a military base in #Barkaram, Kaya department has left approx 40 soldiers dead. The base, found in the Lake Chad region, is speculated to have been attacked by Boko Haram, others have suggested that rebels are responsible. pic.twitter.com/CDr3SNfOqT— Charlie Werb (@WerbCharlie) October 28, 2024 పూర్తిస్థాయి ఇస్లామిక్ రాజ్య స్థాపనే థ్యేయమని చెప్పుకుంటూ 2009లో ఈశాన్య నైజీరియాలో బోకో హరామ్ తీవ్రవాద సంస్థ ప్రారంభమైంది. ఈ గ్రూప్.. పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాను తన కీలక స్థావరంగా చేసుకుంది. ఇప్పటివరకు వేలాదిమంది అమాయకులను కర్కశంగా హతమార్చింది బొకోహరాం తీవ్రవాద సంస్థ. కొన్ని లెక్కల ప్రకారం.. ఈ గ్రూప్ మూడున్నర లక్షల మందిని పొట్టనబెట్టుకున్నట్లు తెలుస్తోందది. వీరి దాడులకు లక్షలాది మంది పౌరులు తమ ఇళ్లను విడిచిపెట్టి వలసవెళ్లటం గమనార్హం. చదవండి: ప్రచారంలో ట్రంప్ జోష్.. భార్యతో కలిసి డ్యాన్సులు -
క్షీణ సరస్సుకు ప్రాణ జలం
ఆఫ్రికాలో ఛాద్ పేరుతో ఓ సరస్సు ఉంది. మనుషులు.. అంటే హోమో సేపియన్స్ ఈ విశాలమైన సరస్సు పక్కనే తమ తొలి నివాసాలు ఏర్పరచుకున్నారని చరిత్ర చెబుతోంది. కామరూన్, ఛాద్, నైజీరియా, నిజెర్ దేశాల సరిహద్దుల్లో ఉండే ఈ సరస్సు ఒకప్పుడు 7 లక్షల 70 వేల చదరపు మైళ్లు విస్తరించి ఉండేది. కానీ ఇప్పుడెంత ఉందో తెలుసా? పట్టుమని 1544 చదరపు మైళ్లే. ఇలాగే వదిలేస్తే ఇంకో వందేళ్లలో సరస్సు అన్నదే లేకుండా పోయి... ఆ ప్రాంతం మొత్తం సహార టైపు ఎడారిగా మారిపోతుందట. ఇప్పుడు ఇదంతా ఎందుకూ అంటే... కొంతమంది ఈ సరస్సును మళ్లీ పూర్వస్థితికి తీసుకురావాలని సంకల్పించారు! అందుకు నిదర్శనం ఈ ఫొటోల్లో కనిపిస్తున్న భారీ, అందమైన భవనం. కామరూన్‌కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ హెర్మాన్ కామ్టే అండ్ అసోసియేట్స్ (హెచ్‌కేఏ) డిజైన్ చేసిన ఈ భవనం ఎన్నో రకాలుగా ప్రత్యేకమైంది. సరే.. ఏం చేస్తారు ఇందులో? ఆఫ్రికా ఖండానికి ఒకవైపున అట్లాంటిక్ మహా సముద్రం ఉంది కదా.. అక్కడి నుంచి ఈ భవనం వరకూ పైపులైన్లు వేస్తారు. ఆ తరువాత సముద్రపు నీటికి మంచినీటిగా మార్చేసి సరస్సులోకి వదిలేస్తారు. ఇలా కొన్నేళ్లపాటు చేస్తే.. ఆ తరువాత నెమ్మదిగా ఈ సరస్సు మళ్లీ జీవవంతమవుతుందని.. దానిపై ఆధారపడ్డ అనేక జీవజాతులు కూడా పూర్వ స్థితికి చేరుకుంటాయని హెచ్‌కేఏ అంచనా. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేసే నిర్లవణీకరణ ప్రక్రియ మొత్తం ఈ భవనంలోనే జరుగుతుందని, దాంతోపాటే సరస్సు తాలూకూ జీవావరణ వ్యవస్థలను అర్థం చేసుకునేందుకు, పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకూ ఈ భవనంలోనే ఓ పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని కంపెనీ చెబుతోంది. ఇంకో తొమ్మిదేళ్లలో అట్లాంటిక్ నుంచి భవనానికి పైపు లేయడం పూర్తవుతుంది. 2020 నుంచి సరస్సు సరిహద్దుల్లో మొక్కల పెంపకం చేపడతారు. అన్నీ అనుకున్నట్లే జరిగితే 2080 నాటికల్లా ఛాద్ సరస్సు తన పూర్వ వైభవాన్ని పొందుతుందని హెచ్‌కేఏ చెబుతోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్