నైజీరియా: నైజీరియాలో దారుణం చోటు చేసుకుంది. శరణార్ధుల క్యాంపులపై ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఉగ్రవాదుల తాకిడిని తట్టుకోలేక నైజీరియాకు ఈశాన్య దిక్కున ఉన్న మైదుగురి ప్రాంతంలోకి వలస వెళ్లి కొన్ని టెంట్ల కింద శరణార్థులుగా ఉంటున్నవారిపై ఉగ్రవాదులు ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. బుధవారం వేకువ జామున ఈ ఘటన చోటు చేసుకుంది. నాలుగు ఆత్మాహుతి దాడులు వరుసగా జరిగాయని ఈ దాడుల్లో క్యాంపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, టెంట్లు పూర్తిగా కాలిపోయాయని అక్కడి అధికారులు చెప్పారు. కాల్పుల శబ్దం కూడా వినిపించినట్లు తెలిపారు.
అయితే, ఎంతమంది చనిపోయారనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఎజెన్సీకి చెందిన అధికారి ఇబ్రహీం అబ్దుల్‌కాదిర్ మాట్లాడుతూ ‘మునా క్యాంపుల్లో బాంబుదాడులు జరిగాయి. నాలుగు ఆత్మాహుతి దాడులు చోటుచేసుకున్నట్లు సమాచారం అందింది. మా వాళ్లు అక్కడికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రాణ నష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది’ అని చెప్పారు.
శరణార్ధులపై ఆత్మాహుతి దాడులు
Published Wed, Mar 22 2017 4:22 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement