కానో: ఈశాన్య నైజీరియాలోని ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 50 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇది బోకోహరమ్ ఉగ్రవాదుల పనేనని అనుమానిస్తున్నారు. అడమవా రాష్ట్ర రాజధాని యొలా ప్రాంతానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉంగువర్ షువా ప్రాంతంలోని మదీనా మసీదులో మంగళవారం ఉదయం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ దాడి చోటుచేసుకుంది. ప్రార్థన చేసేవారితో కలసి వచ్చిన ఓ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.
ఇరాక్‌లో 32 మంది మృతి: ఇరాక్‌లోని తుజ్ ఖుర్మాటు పట్టణంలో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 32 మంది మృతిచెందగా, 80 మంది గాయపడ్డారు. జనంతో రద్దీగా ఉన్న ఓ కూరగాయల మార్కెట్లోకి కారులో వచ్చిన దుండగుడు తనను తాను పేల్చేసుకున్నాడని అధికారులు వెల్లడించారు.
నైజీరియాలో దాడి: 50 మంది మృతి
Published Wed, Nov 22 2017 2:05 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment