మైదుగురి: ఈశాన్య నైజీరియాలో అతిపెద్ద నగరమైన మైదుగురిలో శనివారం బోకో హరామ్ తీవ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 58 మంది మరణించగా 50 మంది గాయపడ్డారు. రెండు మార్కెట్లు, ఒక బస్ టెర్మినల్‌పై తీవ్రవాదులు దాడి చేశారు. ఉదయం 11:20 కి చేపలమార్కెట్‌లోకి ఆటో రిక్షాలో వచ్చిన ఆత్మాహుతి సభ్యురాలు తనను తాను పేల్చుకుంది. ఇది జరిగిన గంట తరువాత మండే మార్కెట్‌లో జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో 15 మంది మరణించారు. మూడో దాడి మధ్యాహ్నం బోర్నొ ఎక్స్‌ప్రెస్ టెర్మినల్‌లో జరిగింది.
నైజీరియాలో ఆత్మాహుతి దాడులు
Published Sun, Mar 8 2015 2:55 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement