పొరపాటున బాంబేశారు..100 మంది మృతి | mistakenly bombs refugee camp', killing more than 100 | Sakshi
Sakshi News home page

పొరపాటున బాంబేశారు..100 మంది మృతి

Published Tue, Jan 17 2017 10:46 PM | Last Updated on Wed, Oct 17 2018 5:27 PM

పొరపాటున బాంబేశారు..100 మంది మృతి - Sakshi

పొరపాటున బాంబేశారు..100 మంది మృతి

నైజీరియా: ఉగ్రవాదులపై వేయాల్సిన బాంబును పొరపాటున శరణార్థుల శిబిరంపై వేయడంతో 100 మందికి పైగా మృతి చెందిన ఘటన నైజీరియాలో చోటు చేసుకుంది. కామెరూన్‌ సరిహద్దు సమీపంలోని రాన్ ప్రాంతంలో.. బోకోహారమ్‌ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్న ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ జెట్‌ విమానం శరణార్థుల శిబిరంపై బాంబు జారవీడిచినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనను నైజీరియా మిలిటరీ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ లక్కీ ఇరాబొర్ ధృవీకరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారిని బోర్నో స్టేట్‌ గవర్నమెంట్‌ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాధితుల్లో శరణార్థులతో పాటు శిబిరంలో సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేషన్స్‌ వితౌట్‌ బార్డర్స్‌, రెడ్‌ క్రాస్‌ సంస్థల సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement