chad
-
మిలిటరీ యూనిట్‌పై దాడి.. 40 మంది మృతి!
అబుజా: మధ్య ఆఫ్రికా దేశమైన చాద్‌లో మిలిటరీ యూనిట్‌పై జిహాదిస్ట్ గ్రూప్ బోకో హరామ్ దాడి చేసింది. ఈ దాడిలో 40 మంది సైనికులు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది.‘‘నైజీరియా సరిహద్దుకు సమీపంలో ఉన్న చాద్ లేక్ ప్రాంతంలోని సైనిక స్థావరాన్ని ఉగ్ర సంస్థ లక్ష్యంగా చేసుకుంది. ఆదివారం అర్థరాత్రి బోకో హరామ్ గ్రూప్ సభ్యులు 200 మందికి పైగా సైనికులు ఉన్న యూనిట్ లక్ష్యంగా దాడి చేశారు. ఈ దాడిలో 40 మంది మరణించారు. సోమవారం తెల్లవారుజామున ఘటనాస్థలిని సందర్శించా. ఈ దాడికి పాల్పడిన వారి రహస్య స్థావరాలను గాలించేందుకు ఆపరేషన్ ప్రారంభించాం’’ అని చాద్ అధ్యక్షుడు మహమత్ ఇద్రిస్ డెబి ఇట్నో ఓ ప్రకటన విడుదల చేశారు.🇹🇩|#Chad: An attack yesterday on a military base in #Barkaram, Kaya department has left approx 40 soldiers dead. The base, found in the Lake Chad region, is speculated to have been attacked by Boko Haram, others have suggested that rebels are responsible. pic.twitter.com/CDr3SNfOqT— Charlie Werb (@WerbCharlie) October 28, 2024 పూర్తిస్థాయి ఇస్లామిక్ రాజ్య స్థాపనే థ్యేయమని చెప్పుకుంటూ 2009లో ఈశాన్య నైజీరియాలో బోకో హరామ్ తీవ్రవాద సంస్థ ప్రారంభమైంది. ఈ గ్రూప్.. పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాను తన కీలక స్థావరంగా చేసుకుంది. ఇప్పటివరకు వేలాదిమంది అమాయకులను కర్కశంగా హతమార్చింది బొకోహరాం తీవ్రవాద సంస్థ. కొన్ని లెక్కల ప్రకారం.. ఈ గ్రూప్ మూడున్నర లక్షల మందిని పొట్టనబెట్టుకున్నట్లు తెలుస్తోందది. వీరి దాడులకు లక్షలాది మంది పౌరులు తమ ఇళ్లను విడిచిపెట్టి వలసవెళ్లటం గమనార్హం. చదవండి: ప్రచారంలో ట్రంప్ జోష్.. భార్యతో కలిసి డ్యాన్సులు -
బంగారం కోసం కొట్లాట.. 100 మంది దుర్మరణం
నద్జమేనా: మధ్య ఆఫ్రికా దేశం చాద్‌లో ఘోరం జరిగింది. బంగారు గనుల్లో అక్రమంగా తవ్వకాలు జరిపే ముఠాల మధ్య ఘర్షణల్లో వంద మందికి పైగా మృతి చెందారు. ఈ విషయాన్ని అక్కడి రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. లిబియా సరిహద్దులోని కౌరీ బౌగౌడీ జిల్లాలో మే 23, 24 తేదీల్లో ఈ ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణలను కట్టడి చేయడానికి అక్కడి సైన్యం రంగంలోకి దిగింది. ప్రస్తుతానికి అక్కడ మైనింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడింది. ఈ సరిహద్దు ప్రాంతంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. లిబియా నుంచి అక్రమంగా సరిహద్దు దాటి వచ్చిన అరబ్స్‌కు, తూర్పు చాద్‌కు చెందిన టమా కమ్యూనిటీకి మధ్య ఈ ఘర్షణలు జరిగినట్లు సమాచారం. అయితే ఘర్షణ చెలరేగడానికి గల ప్రధాన కారణాలు తెలియరాలేదు. బంగారం కోసం ఎగబడి ఉంటారని భావిస్తున్నారు. చాద్.. టెరర్రిజంతో పాటు రెబల్స్ గ్రూప్స్ దాటికి విలవిలలాడుతోంది. రెబల్స్ ఘర్షణల్లోనే అధ్యక్షుడు ఇడ్రిస్ డెబీ మరణించగా.. ఆయన కొడుకు మహమత్ డెబీ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తోంది అక్కడ. -
రెబల్స్‌తో పోరు.. చాద్ అధ్యక్షుడి దారుణ హత్య
ఎండ్జమీనా: మధ్య ఆఫ్రికా దేశం చాద్‌ను మూడు దశబ్దాల పాటు పరిపాలించిన అధ్యక్షుడు ఇద్రిస్ దెబీ ఇత్నో మంగళవారం హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆర్మీ వెల్లడించింది. రెబల్స్‌తో పోరు సందర్భంగా యుద్ధభూమిలో ఆయన మరణించినట్లు తెలిపింది. ఏప్రిల్ 11న చాద్‌లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆయన గెలుపొందినట్లు ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన హత్యకు గురి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో, 18 నెలల ట్రాన్సిషనల్ కౌన్సిల్‌ను ఆయన కుమారుడైన మహమత్ ఇద్రిస్ ఇత్మో (37) నడిపిస్తారని ఆర్మీ ప్రకటించింది. అధ్యక్షుడి మరణానికి కారణమైన రెబల్స్ పక్క దేశమైన లిబియాలో శిక్షణ తీసుకొని వచ్చినట్లు ఆర్మీ భావిస్తోంది. ఎన్నికలు జరిగిన 11నే వారు ఉత్తర చాద్‌లోకి అడుగు పెట్టినట్లు అభిప్రాయపడుతోంది. ఇద్రిస్ దెబీ 1990లో గద్దెనెక్కారు. అప్పటి నుంచి చాద్‌ను పాలిస్తున్నారు. చదవండి: రష్యా సర్జికల్ స్ట్రైక్: 200 ఉగ్రవాదులు ఖతం -
ఆ ఉగ్రవాదిని అంతమొందించాం: ఫ్రాన్స్
పారిస్: ఉగ్రసంస్థ ఆల్-ఖైదా ఇన్ ఇస్లామిక్ మాగ్రేబ్(ఏక్యూఐఎం) ఉత్తరాఫ్రికా నాయకుడు ఆబ్డేమలేక్ డ్రౌకడేల్ను హతమార్చినట్లు ఫ్రాన్స్ తెలిపింది. సాహెల్‌లో ఎన్నో ఏళ్లుగా జిహాదీలతో పోరాడుతున్న తమ బలగాలు సాధించిన గొప్ప విజయం ఇదేనని ప్రకటించింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఉత్తర మాలీలో డ్రౌకడేల్ సహా అతని అనుచరులను బుధవారం ఫ్రాన్స్ బలగాలు, వారి భాగస్వాములు మట్టుబెట్టాయని పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాల ప్రజలపై దాడులకు పాల్పడుతూ, అపహరిస్తున్న డ్రౌకడేల్ గ్యాంగ్‌ను అల్జీరియా సరిహద్దులో హతమార్చినట్లు తెలిపారు. (చదవండి: అంగుళం భూమి వదులుకోం.. క్షమించం: చైనా) అదే విధంగా నేగర్ పశ్చిమ సరిహద్దుల్లో అకృత్యాలకు పాల్పడుతున్న ఇస్లామిక్ స్టేట్ ఇన్ ది గ్రేటర్ సహారా(ఈఐజీఎస్) నాయకుడిని కూడా శుక్రవారం అంతమొందించినట్లు వెల్లడించారు. కాగా 1990లో సంఘటితమైన అల్జేరియన్ రాడికల్ ఇస్లామిస్టులు ఏక్యూఐఎంను ఏర్పాటు చేశారు. సహారన్ సాహెల్ జోన్లో అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో జీ5 సాహెల్ గ్రూప్ సభ్యదేశాలు మౌరిటానియా, మాలి, బుర్కినా ఫాసో, నైగర్, చాద్ ఫ్రాన్స్ సహాయం కోరాయి. ఈ క్రమంలో ఆఫ్రికా దేశాల విజ్ఞప్తి మేరకు సాహెల్‌లో ఉన్న జిహాదీలను ఏరివేసేందుకు దాదాపు 5 వేలకు పైగా బలగాలను అక్కడ మోహరించింది. ఈ నేపథ్యంలో స్థానిక బలగాలతో కలిసి ఫ్రాన్స్ బలగాలు తాజాగా ఇద్దరు కీలక ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టడం గమనార్హం. అయితే ఉగ్రసంస్థలు మాత్రం ఇంతవరకు వారి మృతి గురించి ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. -
చాద్ రాయబారిగా భారతీయ అమెరికన్ మహిళ
వాషింగ్టన్: సెంట్రల్ ఆఫ్రికా దేశం చాద్‌లో తమ తదుపరి దౌత్యవేత్తగా భారత సంతతికి చెందిన గీతా పసిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేశారు. ఆమె ప్రస్తుతం ఆఫీస్ ఆఫ్ కెరీర్ డెవలప్మెంట్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 2011-14 మధ్యకాలంలో జిబౌటి దేశంలో అమెరికా రాయబారిగా ఆమె సేవలందించారు. అంతకుముందు రెండేళ్లు తూర్పు ఆఫ్రికా వ్యవహారాల కార్యాలయ డెరైక్టర్‌గా పనిచేశారు. అమెరికా విదేశీ వ్యవహారాల విభాగంలో 1988లో చేరిన గీత భారత్‌తో పాటు కామెరూన్, ఘనా, రొమేనియాల్లోనూ పనిచేశారు. చాద్ దౌత్యవేత్తతో పాటు పలు కీలక పదవులకు అధికారులను ఒబామా నామినేట్ చేసినట్లు వైట్‌హౌస్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. -
చాద్‌లో జంట పేలుళ్లు: 25 మంది మృతి
ఎన్'డిజమెనా: మధ్య ఆఫ్రికా దేశం చాంద్ సోమవారం పేలుళ్లతో దద్దరిల్లింది. రాజధాని నగరం ఎన్'డిజమెనాలో ఉగ్రవాదులు జరిపిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 25 మంది మరణించగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మోటార్ బైకుపై దూసుకొచ్చిన ఉగ్రవాది.. సెంట్రల్ పోలీస్ స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద తనను తాపు పేల్చుకున్నాడని, ఇక్కడికి సమీపంలోని పోలీస్ స్కూలు వద్ద కూడా ఇదే తరహాలో ఆత్మాహుతి దాడి జరిగిందని పోలీసులు చెప్పారు. రెండు ఘటనల్లో 25 మంది మృతిచెందగా, పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని, వారిని సమీప ఆసుపత్రులకు తరలించామని తెలిపారు. సంఘటనా స్థలానికి కూతవేటు దూరంలోనే చాంద్ అధ్యక్ష భవనం, ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ఉండటం గమనార్హం. కాగా, చాంద్లో ఈ తరహా దాడి జరగటం ఇదే మొదటిసారి. ఐఎస్ఐఎస్ నైజీరియా శాఖగానీ, బొకో హరామ్ ఉగ్రవాద సంస్థగానీ ఈ దాడులకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.