వావ్‌.. నైజీరియన్స్‌ నోట షారుఖ్‌ పాట | Shah Rukh Khan Nigerian fans Singing Dil To Pagal Hai song | Sakshi

వైరలవుతున్న నైజీరియన్స్‌ పాడిన పాట

Feb 9 2019 5:37 PM | Updated on Apr 3 2019 6:23 PM

Shah Rukh Khan Nigerian fans Singing Dil To Pagal Hai song - Sakshi

విశ్వజనీనంగా మాట్లాడే శక్తి కేవలం సంగీతానికే ఉందనేది జగమెరిగిన సత్యం. ఎల్లలు దాటుతూ, హద్దులు చెరిపివేస్తూ ప్రజలందరినీ ఏకం చేసే శక్తి సంగీతానికి ఉందని ఎన్నో​ సార్లు రుజువైంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఇదే విషయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. నైజీరియాకు చెందిన కొంత మంది కుర్రాళ్లు బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌కు వీరాభిమానులు. అయితే తమ హీరోకు సంబంధించిన సినిమాలోని పాటలను నేర్చుకొని పాడటం వాళ్లకు సరదా. అయితే అలీ గుల్‌ ఖాన్‌ అనే వ్యక్తి గతంలో వీరి పాటకు సంబంధించిన పాటను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. షారుఖ్‌ హిట్‌ సినిమా ‘కల్ హో న హోలో’లోని టైటిల్‌ సాంగ్‌ పాడి సంగీత ప్రియుల మనసులను గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా షారుఖ్‌కు చెందిన మరో పాటను పాడి సంగీతంపై, తమ హీరోపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు నైజీరియన్‌ కుర్రాళ్లు.  

తాజాగా అలీ గుల్‌ ఖాన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన మరో వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. షారుఖ్‌ హిట్‌ సినిమా ‘దిల్ తో పాగల్ హై’ లోని ‘బోలి సి సూరత్‌’పాటను ఐదుగురు నైజీరియన్‌ కుర్రాళ్లు పాడుతూ సంగీత ప్రియులను ఆశ్చర్యపరిచారు. వాళ్లలో ఒకరు పాట పాడుతుంటే మిగతా వారు కోరస్‌ ఇచ్చారు. వాళ్ల అద్భుత ప్రదర్శనకు సంగీతం తెలిసిన వారు, తెలియనివారు అందరూ ముగ్దులవుతున్నారు. ఇక అలీ వీడియో షేర్‌ చేస్తూ ‘బాలీవుడ్‌ సినిమాలను భారతీయులకంటే నైజీరియన్లే ఎక్కువ చూస్తున్నారని అనిపిస్తోంది. మరో పాటను అద్భుతంగా పాడారు’ అంటూ వీడియో కింద పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement