ఢిల్లీ: మరో మంకీపాక్స్ కేసు దేశంలో నమోదైంది. ఢిల్లీలో 22 ఏళ్ల యువతికి మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది. ఆఫ్రికాకు చెందిన సదరు యువతి.. నైజీరియా నుంచి నెల కిందట వచ్చింది.
మంకీపాక్స్ లక్షణాలతో లోక్నాయక్ జయప్రకాష్ ఆస్పత్రిలో చేరిన యువతికి టెస్టుల అనంతరం శుక్రవారం రాత్రి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది.
ఢిల్లీలో ఇప్పటి వరకూ మొత్తం ఐదు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం నలుగురు చికిత్స పొందుతున్నారు. ఇందులో ఇద్దరు యువతులు.
తేలికపాటి వైరస్ అయిన మంకీపాక్స్.. మశూచి లాంటిదే!. ఇది తొలిసారిగా 1958లో బయటపడింది. కోతులకు ముడిపడి ఉందన్న నేపథ్యంతో.. దీనికి మంకీపాక్స్ అని పేరుపెట్టారు. 1970లో మొదటిసారి మనుషుల్లో ఈ వ్యాధి కనిపించింది. 2003లో అమెరికాలో ఈ వైరస్ ఛాయల్ని గుర్తించారు. 2018లో ఈ వ్యాధి ఇజ్రాయెల్, బ్రిటన్ లకు చేరింది. ఇప్పుడు భారత్ సహా 75 దేశాలకు పైగా విస్తరించింది.
ఇదీ చదవండి: మంకీపాక్స్-చికెన్‌పాక్స్ తేడాలు ఎలా గుర్తించాలో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment