Loknayak Jayaprakash Narayan
-
Monkeypox: దేశంలో మరో మంకీపాక్స్ కేసు
ఢిల్లీ: మరో మంకీపాక్స్ కేసు దేశంలో నమోదైంది. ఢిల్లీలో 22 ఏళ్ల యువతికి మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది. ఆఫ్రికాకు చెందిన సదరు యువతి.. నైజీరియా నుంచి నెల కిందట వచ్చింది. మంకీపాక్స్ లక్షణాలతో లోక్‌నాయక్ జయప్రకాష్ ఆస్పత్రిలో చేరిన యువతికి టెస్టుల అనంతరం శుక్రవారం రాత్రి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఢిల్లీలో ఇప్పటి వరకూ మొత్తం ఐదు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం నలుగురు చికిత్స పొందుతున్నారు. ఇందులో ఇద్దరు యువతులు. తేలికపాటి వైరస్ అయిన మంకీపాక్స్.. మశూచి లాంటిదే!. ఇది తొలిసారిగా 1958లో బయటపడింది. కోతులకు ముడిపడి ఉందన్న నేపథ్యంతో.. దీనికి మంకీపాక్స్ అని పేరుపెట్టారు. 1970లో మొదటిసారి మనుషుల్లో ఈ వ్యాధి కనిపించింది. 2003లో అమెరికాలో ఈ వైరస్ ఛాయల్ని గుర్తించారు. 2018లో ఈ వ్యాధి ఇజ్రాయెల్, బ్రిటన్ లకు చేరింది. ఇప్పుడు భారత్ సహా 75 దేశాలకు పైగా విస్తరించింది. ఇదీ చదవండి: మంకీపాక్స్-చికెన్‌పాక్స్ తేడాలు ఎలా గుర్తించాలో తెలుసా? -
ఆ చీకటిరోజుల వల్లే..!
-
ఆ చీకటిరోజుల వల్లే..!
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ చీకటి రోజులు దేశ ప్రజాస్వామానికి తీవ్ర ఎదురుదెబ్బే అయినా.. ఆ సమయంలోనే దేశంలో నూతన రాజకీయ తరం అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ 113వ జయంతి సందర్భంగా ఆ మహానేతకు మోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'ఎమర్జెన్సీని గుర్తుచేసుకుంటూ మనం ఏడ్సాల్సిన అవసరం లేదు. ఎలా ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది' అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ గురించి తెలుసుకొని మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరముందని అన్నారు. ఎమర్జెన్సీ కాలంలో పుట్టిన రాజకీయతరం ప్రజాస్వామిక విలువలకు అంకితమై పనిచేసిందని గుర్తుచేశారు. ఎమర్జెన్సీ నాటి నాయకత్వం టీవీ స్ర్కీన్లలో కనిపించడానికి పాకులాడలేదని, దేశ ప్రజయోనాల కోసమే చావో-రేవో అన్నట్టు పనిచేసిందని పేర్కొన్నారు. ఎమర్జెన్సీకాలంలో జైలుకు వెళ్లిన బీజేపీ కురువృద్ధ నేత ఎల్కే అద్వానీ, మిత్రపక్షం ఎస్ఏడీ నేత ప్రకాశ్‌సింగ్ బాదల్ పోరాటాలను ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితి విధించిన 1975-76 మధ్యకాలంలో జైలుకు వెళ్లిన పలువురిని ప్రధాని మోదీ సత్కరించారు.