ఆ చీకటిరోజుల వల్లే..! | Emergency Strengthened Democracy, Gave Birth a New Leadership: PM Modi | Sakshi
Sakshi News home page

ఆ చీకటిరోజుల వల్లే..!

Published Sun, Oct 11 2015 5:51 PM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

ఆ చీకటిరోజుల వల్లే..! - Sakshi

ఆ చీకటిరోజుల వల్లే..!

న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ చీకటి రోజులు దేశ ప్రజాస్వామానికి తీవ్ర ఎదురుదెబ్బే అయినా..  ఆ సమయంలోనే దేశంలో నూతన రాజకీయ తరం అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ 113వ జయంతి సందర్భంగా ఆ మహానేతకు మోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'ఎమర్జెన్సీని గుర్తుచేసుకుంటూ మనం ఏడ్సాల్సిన అవసరం లేదు. ఎలా ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది' అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ గురించి తెలుసుకొని మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరముందని అన్నారు.

ఎమర్జెన్సీ కాలంలో పుట్టిన రాజకీయతరం ప్రజాస్వామిక విలువలకు అంకితమై పనిచేసిందని గుర్తుచేశారు. ఎమర్జెన్సీ నాటి నాయకత్వం టీవీ స్ర్కీన్లలో కనిపించడానికి పాకులాడలేదని, దేశ ప్రజయోనాల కోసమే చావో-రేవో అన్నట్టు పనిచేసిందని పేర్కొన్నారు. ఎమర్జెన్సీకాలంలో జైలుకు వెళ్లిన బీజేపీ కురువృద్ధ నేత ఎల్కే అద్వానీ, మిత్రపక్షం ఎస్ఏడీ నేత ప్రకాశ్సింగ్ బాదల్ పోరాటాలను ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితి విధించిన 1975-76 మధ్యకాలంలో జైలుకు  వెళ్లిన పలువురిని ప్రధాని మోదీ సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement