
అరెస్టయిన నైజీరియా సైబర్ నేరస్తులు
భువనేశ్వర్ ఒరిస్సా : రాష్ట్ర క్రైం శాఖ పోలీసులు నైజీరియా దేశానికి చెందిన ఇద్దరు సైబర్ నేరస్తుల్ని అరెస్టు చేశారు. న్యూ ఢిల్లీలో వీరివుర్ని ఆదివారం అరెస్టు చేశారు. ఒyనైజీరియా సైబర్ నేరస్తుల అరెస్టుశా, మహారాష్ట్ర ప్రాంతాల్లో వీరివురు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణ.
దీర్ఘకాలంగా వీరివురి ఆచూకీ కోసం ఇరు రాష్ట్రాలు గాలిస్తున్నాయి. న్యూ ఢిల్లీలో వీరివురు బస చేసినట్టు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా రాష్ట్ర క్రైం శాఖ పోలీసులు దాడి చేసి నేరస్తుల్ని అరెస్టు చేశారు. లాటరీ అధికారులుగా స్వీయ పరిచయం చేసుకుని ప్రజల్ని నమ్మించి మోసగించడంలో వీరు ఆరి తేరారు.
భారీ నగదు, పలు రకాల బహుమానాలు అందజేస్తామని ప్రలోభ పరచి అమాయక ప్రజల బ్యాంకు ఖాతా వివరాల్ని సేకరించి ఆన్‌లైన్‌లో నగదు దోచుకుంటున్నారు. రాష్ట్రంలో దాదాపు రూ. 10.50 లక్షల వరకు దోచుకున్నారు. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు కోసం వీరివుర్ని ప్రశ్నించనున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment