నైజీరియా చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి  | 31 Dead In Stampede At Nigeria Church Food Event | Sakshi
Sakshi News home page

నైజీరియా చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి 

Published Sun, May 29 2022 1:55 PM | Last Updated on Sun, May 29 2022 2:48 PM

31 Dead In Stampede At Nigeria Church Food Event - Sakshi

అబూజా: నైజీరియాలోని రివర్స్‌ రాష్ట్రం హర్‌కోర్ట్‌ నగరంలోని ఓ చర్చిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో చిన్నారులతో సహా 31 మంది ప్రాణాలు కోల్పోగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని కింగ్స్‌ అసెంబ్లీ పెంటెకొస్టల్‌ చర్చిలో శనివారం ఉదయం 9 గంటలకు పేదలకు పలు వస్తువులను ఉచితంగా అందజేస్తామంటూ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో, ఉదయం 5 గంటలకే భారీ సంఖ్యలో జనం చర్చి వద్ద క్యూ కట్టారు. రద్దీ పెరిగి, చర్చిగేట్లు విరగ్గొట్టారు. ఇది తొక్కిసలాటకు దారితీసి 31 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. నిర్వాహకులు ఉచిత పంపిణీని రద్దు చేశారు. 
చదవండి: టెక్సాస్‌ నరమేధం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement