నగరంలో రెచ్చిపోయిన కామాంధులు
హైదరాబాద్ : నగరంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలపై అత్యాచారానికి యత్నించిన ఘటనలు బుధవారం ఒక్కరోజే నగరంలో రెండు వెలుగులోకి వచ్చాయి. ఎల్బీనగర్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
శంషాబాద్ ఎయిర్ పోర్టు పీఎస్ పరిధిలో ఓ యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు గత కొంతకాలంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు బుధవారం రాత్రి దుండగుల నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాచ్‌మెన్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరో ఘటనలో ఎల్బీనగర్ బండ్లగూడలో ఓ బాలికపై ఓల్డేజ్ హోమ్ నిర్వాహకుడు రామకృష్ణ అత్యాచారయత్నం చేశాడు. దీంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై ప్రజా, మహిళా సంఘాలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నగరంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని... ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాయి.