రాజమండ్రి క్రైం: గుర్తు తెలియని ప్రవాస భారతీయుడొకరు రాజమండ్రిలో కిడ్నాప్‌నకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. రాజమండ్రి నగరంలోని సోమాలమ్మ ఆలయం సమీపంలో ఓ ఇంటీరియర్ డెకరేషన్ దుకాణం ఉంది. ఆ దుకాణం వద్దకు గత నాలుగు రోజులుగా ఓ ఎన్నారై వస్తున్నాడు. రాజమండ్రి దగ్గరే తమ గ్రామం ఉందని చెప్పి పరిచయం చేసుకున్న ఆయన..తనకు విదేశాల్లో పలుకుబడి ఉందని, ఏదైనా సాయం కావాలంటే చేస్తానంటూ దుకాణ యజమానితో చెబుతున్నాడు.
ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సదరు ఎన్నారై ఆ దుకాణం వద్ద ఉండగా ఒక స్కోడా కారు వేగంగా వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఎన్నారైని బెదిరించి తమ వెంట తీసుకుపోయారు. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది. దీనిపై ఇంటీరియర్ దుకాణం యజమాని రాజమండ్రి ప్రకాష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఎన్నారై ఎవరు, అతనిని ఎవరు కిడ్నాప్ చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రాజమండ్రిలో ఎన్నారై కిడ్నాప్..?
Published Wed, Sep 2 2015 6:16 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
Advertisement
Advertisement