ప్రొఫెసర్ల విడుదలపై వీడని ఉత్కంఠ | no clarity on telugu proffesors in lybia | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్ల విడుదలపై వీడని ఉత్కంఠ

Published Sat, Aug 8 2015 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

no clarity on telugu proffesors in lybia

సాక్షి, హైదరాబాద్: లిబియాలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన ప్రొఫెసర్లు ఇంకా విడుదల కాలేదు. శుక్రవారం అర్ధరాత్రి వరకూ వారి విడుదలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అల్వాల్‌కు చెందిన ప్రొఫెసర్ చిలివేరు బలరాం కిషన్, నాచారానికి చెందిన ప్రొఫెసర్ గోపీకృష్ణలను ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి ఏడు గంటలకు విడుదల చేస్తారని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అయితే అర్ధరాత్రి వరకూ విడుదలపై అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement